తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోగా, నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు మాధవన్. మ్యాడీగా ముద్దుగా పిలుచుకునే మాధవన్ మొదటి సారి మెగా ఫోన్ పట్టారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా మాధవన్ నటించి తెరకెక్కించిన చిత్రం 'రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్'.
తెలుగు, తమిళ భాషలకు హీరో సూర్య కీలక అతిథి పాత్రలో నటించారు. అదే పాత్రలో బాలీవుడ్ వెర్షన్ లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కనిపించబోతున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. దేశానికి అత్యంత శక్తివంతమైన రాకెట్ లని అందించిన నంబి నారాయణన్‌ని దేశ ద్రోహిగా చిత్రిస్తూ ఆయనని జైలు జీవితం అనుభవించేలా చేశారు. దాని వెనక ఏం జరిగింది?.. ఎవరున్నారు? వంటి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడిస్తూ మాధవన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం కేన్స్ ఫెస్టివెల్ లో ఈ సినిమాని ప్రదర్శించారు.
ఈ మూవీని చూసిన పలువురు ప్రముఖులు మాధవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిగ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ కూడా మాధవన్‌పై, తను రూపొందించిన సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'కేన్స్ లో ఇప్పుడే 'రాకెట్రీ :ది నంబి ఎఫెక్ట్' చూశాను. కొత్త పిలుపుని, కొత్త దానాన్ని ఇండియన్ సినిమాకు పరిచయం చేసినందుకు మాధవన్ కు టేకె బౌ 'అంటూ #changeishere #respecttoIndianscientists హ్యాష్ ట్యాగ్ లని షేర్ చేశాడు.
ప్రస్తుతం రెహమాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది, ఇదిలా వుంటే ఈ మూవీ స్క్రినింగ్ అనంతరం మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆర్యభట్ట నుంచి సుందర్ నిచాయ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన అనేక వ్యక్తులకు ఎన్నో అసాధారణమైన చరిత్ర వుంది. వీరికి సినీతారలు, నటీనటుల కంటే ఎక్కువ అభిమానులున్నారు. యువతకు వారెంతో స్ఫూర్తి. కానీ ఇలాంటి వారిపై మేము సినిమాలు తీయడం లేదు.
సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించి వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన వ్యక్తులను సినీ ప్రొడ్యూసర్స్ గుర్తించడం లేదు. క్రిస్టోఫర్ నోలాన్ సినిమాకు రివ్యూ ఇవ్వడానికి సమీక్షకులు భయపడతారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలో అర్థం కాకో.. ఏదో ఒకటి రాసి ఫూల్ అవ్వడానికి ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ఆయన తీసిన 'ఇన్ సెప్షన్' నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఆయనకు సైన్స్ పై వున్న పరిజ్క్షానం వల్ల ఆయనపై నాకు చాలా గౌవరం వుంది' అన్నారు మాధవన్.