మొన్నేమో నవదీప్.. ఆ తరువాత డ్యాన్సు మాష్టర్ రఘు.. ఇప్పుడేమో కొన్నేళ్ల క్రితం వచ్చిన శేఖర్ కమ్ముల మూవీ హ్యాపీడేస్ లో టైసన్ గా అలరించాడు గుర్తున్నాడా? ఆ టైసన్ కూడా.. వీళ్ళందరూ సిక్స్ ప్యాక్ చేసేశారు. అసలు ఈ ప్యాక్ వలన ఉపయోగం ఏంటో ఓసారి చూద్దామా...
వీళ్లందరిలో ప్యాకులు చేయాలనే తపన బాగానే ఉంది కానీ.. కాని ఇలాంటివి ఏ మాత్రం వర్కవుట్ అవుతాయన్నదే అసలు ప్రశ్న. నిజానికి సినిమాల్లో హీరోయిజం బీభత్సంగా పండటానికి ఈ సిక్స్ ప్యాకులు ఒకింత ఉపయోగపడాతాయి. బన్నీ - సునీల్ - విశాల్ మొదలగు హీరోలు.. ఈ ప్యాకులను బాగానే చెక్కేసి.. సదరు ప్యాకులు చూపించిన సినిమాలతో మాంచి హిట్లే కొట్టారు. దేశముదురు - పూలరంగడు మొదలగు సినిమాల్లో ఈ ప్యాకుల కోసం సీన్లు.. అభిమానుల కేకలు.. అన్నీ వర్కవుట్ అయ్యాయ్. కాని ప్రభాస్ విషయంలో బుజ్జిగాడు దెబ్బేసింది. ఇక మహేష్ అయితే సిక్స్ ప్యాక్ ను మధ్యలోనే వదిలేశాడు. సో.. ప్యాక్ చేస్తే హిట్టు గ్యారంటీ అని చెప్పలేం.
ఇక స్టార్ హీరోలను పక్కనెట్టేస్తే.. ఇలాంటి బాడీ చేంజెస్ ఏవైనా చేయాలంటే.. డిమాండ్ ఉన్నప్పుడు చేసుంటే పేరుకు పేరు, గుర్తింపుకి గుర్తింపు వస్తాయేమో. కాని ఫేడవుట్ టైములో సిక్స్ ప్యాక్ చేస్తే... అప్పటికే పట్టించుకోని దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ప్యాకులు చేసినంత మాత్రాన ప్యాకేజ్ పట్టుకుని రావడానికి సిద్ధమవుతారా ఏంటి!!