సోషల్ మీడియాలో కొందరు అత్యంత దారుణమైన పదజాలంతో పోస్ట్ లు పెట్టడం.. కామెంట్స్ చేయడం చేస్తూ ఉంటారు. సాదారణ నెటిజన్స్ ఆ పదజాలంతో పోస్ట్ లు పెట్టినా పదుల మంది చూస్తారేమో. కాని సెలబ్రెటీలు పోస్ట్ లు పెడితే సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది చూస్తారు. స్టార్స్ అయితే కోట్ల మందికి వారి పోస్ట్ లు రీచ్ అవుతాయి. కను ప్రతి ఒక్క సెలబ్రెటీ కూడా ఒక్క పోస్ట్ పెట్టినా.. పోస్ట్ లో ఏ పదం ఉపయోగించాలన్నా కూడా ఒకటికి పది సార్లు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సెలబ్రెటీలు బాధ్యతారాహిత్యంతో పెట్టిన పోస్ట్ ల కారణంగా పలు సందర్బాల్లో వివాదాలు అయిన విషయం తెల్సిందే. ఇటీవల రాహుల్ రామకృష్ణ పెట్టిన పోస్ట్ ఒకటి వివాదాస్పదంగా మారింది.
రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ మూవీ 'నెట్' ను అతి త్వరలోనే స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు. ఆ సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో కాస్త అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నాడు. ఆయన పెట్టిన పోస్ట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా సినిమాకి గు... లో దమ్ముంది అంటూ పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్ కు నెటిజన్స్ కొందరు ట్రోల్స్ కురిపించారు. నువ్వు ఒక సెలబ్రెటీవి అనే విషయాన్ని మర్చిపోయినట్లున్నావు. నీ పోస్ట్ ను కొన్ని లక్షల మంది చూస్తారనే కనీసం విజ్ఞత కూడా నీకు లేకుండా పోయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్స్ ట్రోల్స్ కు రాహుల్ రామకృష్ణ తన ట్వీట్ ను డిలీట్ చేస్తాడేమో అనుకుంటే ఆయన మరో ట్వీట్ ను చేశాడు. ట్విట్టర్ లో ఉన్న వారు అంతా కూడా పతిత్తులా అంటూ మరింత రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశాడు. రాహుల్ ను ట్రోల్ చేస్తున్న వారు మాత్రమే కాకుండా సమర్థిస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయన సినిమా ప్రమోషన్ కోసం సాదారణంగానే దమ్మున్న సినిమా అంటూ చెప్పేందుకు సహజంగా చెప్పాడు. దానికి విమర్శించాల్సిన అవసరం ఏమీ లేదు. సెలబ్రెటీలు అయినా మరెవ్వరు అయినా కూడా కొన్ని ఎమోషన్స్ సమయంలో వచ్చే మాటలను సీరియస్ గా తీసుకుని వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు అంటూ కొందరు రాహుల్ కు మద్దతుగా నిలిచారు. మొత్తానికి రాహుల్ రామకృష్ణ గురించిన విషయం వైరల్ అయ్యింది.