ఆ స్విచ్ ఆఫ్ చేస్తే సరి.. రకుల్ ఎపిసోడ్ పై రాహుల్

Update: 2019-01-21 10:18 GMT
రకుల్ కారులోనుంచి దిగే ఫోటో సోషల్ మీడియాలో రావడం.. అందులో రకుల్ పొట్టి నిక్కర్ వేసుకొని ఉండడంతో నెటిజనులు అసభ్యపదజాలంతో దూషించడం.. దానికి రకుల్ కాస్త ఘాటుగా వారి భాషలోనే సమాధానం చెప్పడం తో అదో పెద్ద హంగామా అయింది.  రకుల్ కు వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ చేశారు.  ఆ తర్వాత రకుల్ అసలు ఎందుకు 'అమ్మ' పదం తీసుకురావాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది.  ఎంత వివరణ ఇచ్చినా ఇంకా ఆ హంగామా చల్లారలేదు.

ఈ విషయంలో రకుల్ ప్రీత్ కు మద్దతుగా నిలిచాడు హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.  దీంతో నెటిజనులు రాహుల్ పై విరుచుకుపడ్డారు..కొందరేమో రాహుల్ కు బాసటగా నిలిచారు.  కొందరు నెటిజనులకు ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చిన రాహుల్.. ఇలా జనాలకు అర్థమయ్యేలా లేదనుకున్నాడో ఏమో గానీ తన బ్లాగ్ 'rahullabaloo' ద్వారా "ది జెండర్ పాలిటిక్స్ ఆఫ్ కల్చర్" అంటూ ఒక రామాయణ కావ్యం అంత పెద్ద పోస్ట్ పెట్టాడు.. సారీ.. పెద్ద కాదు.. పేద్ద పోస్ట్.

ఈ పోస్టు మొత్తాన్ని తెలుగులోకి అనువదిస్తే మీ మెదళ్ళు హీటెక్కడం ఖాయం గానీ కొన్ని అంశాలు మాత్రం చెప్పుకుందాం.


* నన్ను  ఒక్క ట్వీట్ట్ దెబ్బకు చాలామంది ట్రోలర్లు గట్టిగా తగులుకున్నారు. మొదట్లో అవి చదవడం ఫన్ గా అనిపించిందిగానీ...  తర్వాత నేను ఆలోచిస్తే రకుల్ మాత్రమే కాదు ఇతర అమ్మాయిలు ఎదుర్కొంటున్న ట్రోల్స్ లో నాకు ఎదురైంది ఒక్క శాతమే అని అర్థం చేసుకున్నాను.  నేను ఎవ్వరిని బ్లేమ్ చేయడం లేదు గానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. ఈ ట్రోలర్ల కంటే నాకు ఓపెన్ మైండ్ ఉంది.

* రకుల్ ట్వీట్ లో చాలామంది లేవనెత్తిన అభ్యంతరం ఏంటంటే 'అమ్మ' ప్రస్తావన తీసుకురావడం.  రకుల్ అది కావాలని చేసింది కాదు.  ఒక వ్యక్తి తనను అసభ్యంగా దూషిస్తే.. అతనికి అదేరకమైన భాషలో సమాధానం చెప్తేగానీ అర్థం కాదు కాబట్టి అలా చేసింది. అంతే కానీ రకుల్ అందరినీ 'అమ్మ' పేరుతో తిట్టుకుంటూ పోదు.  నేను ఈమాట అంటే కొందరు మరి 'మా అమ్మ అలాంటి గలీజు డ్రెస్ వేసుకోదు' అని కౌంటర్ ఇస్తారు. అది ఇంకా పెద్ద డిబేట్.   రకుల్ కానీ నేనుగానీ 'అమ్మ'ను అందరూ ఎలా గౌరవిస్తారో అలానే గౌరవించే వ్యక్తులం.

రకుల్ సమాధానం కొంత బెటర్ గా ఉండల్సిందా అని అడిగితే.. నేను 'అవును' అనే చెప్తాను. రకుల్ గానీ నేను గానీ ఆ 'అమ్మ' కు క్షమాపణలు చెప్తాం.  ఒకరి అమ్మను అవమానించిందని అంటున్నారు గానీ అసలు రకుల్ ను ఇన్సల్ట్ చేసేందుకు మొదట వీరికేం హక్కుంది? రకుల్ అని కాదు అసలు ఏ అమ్మాయినైనా అవమానించే హక్కు వీరికెవరు ఇచ్చారు?

* ఇక డ్రెస్ సెన్స్ విషయానికి వద్దాం.  అమ్మాయిలు ఫలనా తరహాలోనే దుస్తులు వేసుకోవాలని చాలామంది అంటుంటారు. వారి రూల్స్ ప్రకారం కాకుండా వేరే రకంగా డ్రస్ వేసుకుంటే దుర్భాషలాడతారు.  ఇక చాలామంది గౌరవప్రదంగా నడుచుకునే వ్యక్తులు.. ఎప్పుడు ఎవరిని ఏమీ అనని వారు కూడా ఈ విషయంలో ఈ ట్రోలర్లకే మద్దతు ఇవ్వడం నేను గమనించాను.  ఒక ఉదాహరణ తీసుకుందాం.  అమ్మాయిలు ఇలానే డ్రెస్ వేసుకోవాలనే అభిప్రాయం ఉన్నవారు కనుక అమెరికాకో లేదా ఐరోపాకో వెళ్ళారనుకోండి.. అక్కడ అంతకంటే చిట్టిపొట్టి డ్రెస్ వేసుకున్న వారిని చూసి ఏం తప్పుగా అనుకోరు.. పైగా వారిని 'వారి కల్చర్ అది కాబట్టి తప్పేమీ లేదు' అని వారికి మద్దతు తెలుపుతారు.
 
అంటే.. దానర్థం వారు తమ 'కల్చర్ స్విచ్' ని అక్కడ ఆఫ్ చేశారన్నమాట. అదే స్విచ్ ని ఇండియాలో మాత్రం ఆన్ చేస్తారు. అమెరికాలో అమెరికన్ అమ్మాయిలపై చూపించే ఔదార్యాన్ని మన అమ్మాయిలపై కూడా చూపిస్తే బాగుంటుంది కదా?

*మరో విషయం ఏంటంటే మగాళ్ళు ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు. ఎవరూ మాట్లాడరు. కానీ అదే అమ్మాయిలు అంటే మాత్రం రూల్స్.. రెగ్యులేషన్స్ వచ్చేస్తాయి.  ఈ రూల్స్ అన్నీ ఇప్పటివి కాదు.. ఎప్పటివో. మారుతున్న పరిస్థితులని బట్టి మనమూ మారాలి.

*నోట్: నా ప్రొఫెషన్ కు ఆ ట్వీట్ సంబంధం ఏంటి? కొందరు నన్ను 'నువ్వేమైనా తోపా?'... 'నువ్వేమైనా బాహుబలి సినిమా తీశావా?' అని  ప్రశ్నిస్తున్నారు.  దానికి నా సమాధానం..."భయ్యా నేనేమీ తోపు కాదు. నేనేమీ బాహుబలి తీయలేదని నాకూ తెలుసు భయ్యా.. మీరు చెప్పక్కరలేదు.  కానీ దానికి దీనికి సంబంధం ఏంటి?"

ఈ పోస్ట్ లింకును రకుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి 'వావ్.  చాలా బాగా రాశాడు. ఇది ఈ ప్రపంచంలో ఉన్న కొందరి దృష్టి కోణాన్ని అయినా మారిస్తే ఈ ప్రపంచం మరింత మెరుగ్గా మారుతుంది." అంటూ ట్వీటింది.

ఏంటి.. ఆర్టికల్ పెద్దదిగా ఉందని అనుకుంటున్నారా. దీనికే ఇలా అంటే రాహుల్ పోస్ట్ సైజు కనుక చూస్తే  మీకు మూర్చ రావడం ఖాయం.  ఎంతసేపు రాశాడో గురుడు..  ఓ పేద్ద నమస్కారం రాహుల్ మహాప్రభో!


Full View

Tags:    

Similar News