చి: ల: సౌ: అంటున్న యంగ్ హీరోలు

Update: 2017-10-11 08:02 GMT
‘అందాల రాక్షసి’.. ‘అలా ఎలా’ లాంటి సినిమాలతో గుర్తింపు సంపాదించిన యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా మారుతున్న సంగతి కొన్ని రోజుల కిందటే వెల్లడైంది. అతను అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా ఈ రోజే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ప్రకటించారు. దీనికి ‘చి: ల: సౌ:’ అనే టైటిల్ నిర్ణయించడం విశేషం. ఈ టైటిల్ వినగానే అప్పట్లో వచ్చిన ‘చి: ల: సౌ: స్రవంతి’ అనే సీరియల్ గుర్తుకొస్తోంది. ఇలాంటి టైటిల్ పెట్టారంటే ఇదేదో లేడీ ఓరియెంటెడ్ మూవీనా అన్న సందేహం కలుగుతోంది. మరి ఈ టైటిల్లో ఏం మతలబు ఉందో?

ఈ రోజు లాంచ్ చేసిన టైటిల్ లోగో చూస్తే అది ఓ పౌరాణిక సినిమాలోని ఘట్టాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. భరత్.. జశ్వంత్.. హరి అనే ముగ్గురు కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. ‘వెళ్లిపోమాకే’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి పని చేయనున్నాడు. సుశాంత్ కెరీర్లో ఇప్పటిదాకా ఒక్క హిట్టూ లేదు. తొలి సినిమా ‘కాళిదాసు’ దగ్గర్నుంచి చివరి సినిమా ‘ఆటాడుకుందాం రా’ వరకు అన్నీ ఫ్లాపులే. ఈ సినిమాలన్నీ సొంత బేనర్లోనే చేసిన సుశాంత్.. ఈసారి బయటి నిర్మాతలతో పని చేస్తుండటం విశేషం. మరి రాహుల్ అయినా అతడికి సక్సెస్ ఇస్తాడేమో చూద్దాం.
Tags:    

Similar News