హైదరాబాద్ పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ ఉధృతంగా కొనసాగుతోంది. 142 మంది లిస్ట్ ను పోలీసులు తాజాగా విడుదల చేశారు. పార్టీకి హాజరైన వారిలో బిగ్ సెలబబ్రెటీలు, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పార్టీకి వెళ్లిన వాళ్లలో ఒకరు. ఈయన పార్టీకి ఎందుకు వచ్చారు? పబ్ లో రాత్రి అసలేం జరిగిందిదన్నది తాజాగా వివరించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు.
పబ్ లో పార్టీకి కుటుంబంతో వెళ్లాలనని.. ఫ్యామిలీతో వీకెండ్ చిల్ కావడానికి వెళితే తప్పేంటని ప్రశ్నించారు. ఫ్రెండ్ పుట్టినరోజు కావడంతోనే వెళ్లినట్లు తెలిపారు. కొందరు పబ్ నుంచే పారిపోయారు కానీ తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించినట్టు వెల్లడించారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని.. పబ్ లో దొరికిన మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ విచారణకు అయినా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. తన శాంపిల్స్ ఇవ్వడానికి ఎప్పుడైనా రెడీ అన్నారు.
ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఈసారి తానే పట్టిస్తానని రాహుల్ తెలిపారు. తప్పు చేయకపోయినా తనపై వివాదాలు సృష్టిస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటారని రాహుల్ సిప్లిగంజ్ ప్రశ్నించాడు. అడ్డంగా దొరికిపోయారు అంటూ సోషల్ మీడియాలో తమను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడం తగదని రాహుల్ వాపోయాడు. నిర్ణీత సమయానికి పబ్ మూకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి కానీ తమను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు.
పబ్ నుచి బయటకు వెళ్లాలంటేనే 40 నిమిషాలు టైం పడుతుందని.. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్లే పబ్ నుంచి బయటకు వెళ్లడం ఆలస్యమైందని రాహుల్ వివరణ ఇచ్చాడు. రాడిసన్ క్లబ్ కు తాను వెల్లడం ఇది రెండోసారి అని రాహుల్ పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకునే వ్యవహారంలో తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధమన్నారు.
Full View