నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. కోట్లాది మంది మనసులు గెలుచుకుని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్నారు. ముందే తుపాకి చెప్పినదే నిజమైంది. 105 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎమోషన్స్ చూసిన రాహుల్ ఎట్టకేలకు విజేతగా ట్రోఫీతో పాటుగా రూ.50లక్షలు అందుకున్నాడు. అతడికి 8.52 కోట్ల మంది ఓట్లు వేశారని హోస్ట్ నాగార్జున వెల్లడించారు. ఇక ఈ ట్రోఫీని మెగా బాస్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ అందుకున్నారు. ఈ ఫినాలేలో శ్రీముఖిని రన్నర్ గా ప్రకటించారు.
25 ఏళ్లుగా బిగ్ బాస్ ఇండియాలో పాపులరైంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బ్రదర్ గా అందరికీ సుపరిచితం అని నాగార్జున వెల్లడించారు. ``బిగ్ బాస్ గ్రేట్ షో అని నాకు తెలుసు. కోట్లాది మంది అభిమానించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇలాంటి షో గ్రేట్ ఫినాలేకి నన్ను అతిధిగా పిలవడం నా మిత్రుడు నాగ్ కి థాంక్స్`` అని చిరంజీవి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో 360 సీజన్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద రియాలిటీ షో ఇది. ఇండియాలో 36 భాషల్లో 7 సీజన్స్ జరిగాయి అని చిరు తెలిపారు. ఇన్ని షోలు జరుగుతున్నా ప్రపంచంలోనే తెలుగు బిగ్ బాస్ నంబర్ వన్ షో అని పొగిడేశారు. అంతమంది ఈ షోని ఆదరించారని వెల్లడించారు. ఇంతకీ బిగ్ బాస్ షోతో గెలుచుకున్న 50లక్షల్ని రాహుల్ ఏం చేస్తాడు? అంటే .. ముందుగా అద్దె ఇంటి నుంచి కొత్త ఇంటికి తన తల్లిదండ్రుల్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. షో గెలిచినా గెలవకపోయినా వాళ్లకు ఒక ఫ్లాట్ కొంటానని ప్రామిస్ చేశాడు. అయితే రూ.50లక్షలుతో హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ కొనడం కూడా కష్టమే. మరో కోటి సంపాదిస్తే కానీ తనకు నచ్చే ఏరియాలో కొనలేడు. ఇండ్ల ధరలు చుక్కల్ని అంటి ఉన్నాయి మరి. రాహుల్ ఈ ఫీట్ సిసలైన రియల్ బిగ్ లైఫ్ లో ఎలా సాధిస్తాడో చూడాలి.