బిగ్‌ బాస్ కంట్రోల్ త‌ప్పింది..కొట్టుకున్న వ‌రుణ్ - రాహుల్‌

Update: 2019-09-26 04:45 GMT
బిగ్ బాస్ షోలో ఏదైనా జరగొచ్చు అనే విషయం మరోసారి రుజువైంది. బిగ్ బాస్ పెట్టే టాస్కుల వల్ల శత్రువులు కాస్తా మిత్రులు అయిపోతున్నారు....ఇక మిత్రులు కాస్తా శత్రువులుగా మారిపోతున్నారు. కరెక్ట్ గా బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ లో అదే జరిగింది. మంగళవారం ఎపిసోడ్ లో ఇచ్చిన అత్త రాజ్యంలో కోడళ్ళ పాట్లు టాస్క్ బుధవారం ఎపిసోడ్ లో కొనసాగింది. ఈ టాస్క్ ప్రకారం అత్తగా ఉన్న శివజ్యోతిని ఇంప్రెస్ చేసి...మొగుడు-పెళ్ళాలుగా ఉన్న వరుణ్-వితికా - రాహుల్-పునర్నవి - రవి-శ్రీముఖి జంటలు ఆమె దగ్గర ఉన్న ఇటుకలని దక్కించుకుని ఓ గోడ కట్టాలి.

టాస్క్ అయిపోయేసరికి ఎవరి గోడ పెద్దగా ఉంటుందో ఆ జంట  కెప్టెన్ టాస్క్ లో పోటీ పడతారు. ఈ క్రమంలోనే బుధవారం ఎపిసోడ్‌లో అత్తగా ఉన్న శివజ్యోతి... ఆ జంటలకు ఇటుకలు పంపిణీ చేసింది. ఇక వారు ఇటుకలు పట్టుకెళ్లి గోడ కట్టే సమయంలో వారి మధ్య గొడవ చెలరేగింది. ఈ సందర్భంలో వరుణ్ ని అడ్డుకుని తన దగ్గరున్న ఇటుకలని రాహుల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇక్కడే వరుణ్ మీద రాహుల్ బలప్రదర్శన చేశాడు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన వితికా రాహుల్ ని గిచ్చింది. దీంతో రాహుల్...వరుణ్ ని లేపి కింద పడేశాడు.

ఇలా ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఒకరికి తగిలిన దెబ్బలని ఒకరు చూపించుకుంటూ...ఇద్దరు మాటల యుద్ధానికి దిగారు. నిన్నటి వరకూ గ్రూప్ కట్టి బెస్ట్ ఫ్రెండ్స్‌ గా ఉన్న రాహుల్ - వరుణ్‌ ఈ ఒక్క టాస్క్‌ తో పాత గొడవల్ని తవ్వుకున్నారు. ఒక వైపు రాహుల్ - వరుణ్‌ లు కొట్టుకుంటుంటే.. ఇదే మనకు ఛాన్స్ అని శ్రీముఖి - రవిలు ఇటుకలను సర్దేశారు. ఇక నేటి నుండి అసలు గేమ్ స్టార్ట్ అయ్యిందని రాహుల్ శపథం చేసి.. ఆడవాళ్లను ముందుకు నెట్టి గేమ్ ఆడ‌టం మగాడితనం కాదు అని వార్ మొదలు పెట్టాడు. ఇంట్లో వాళ్లిద్దరే కరెక్ట్ మిగిలిన వాళ్లు కరెక్ట్ కాదా? అంటూ వరుణ్..రాహుల్-పున్నూలని ఉద్దేశించి మాట్లాడుతూ ఫైర్ అవుతున్నాడు. మరి గురువారం ఎపిసోడ్ లో ఈ వార్ ఎక్కడ వరకు వెళుతుందో ?చూడాలి.



Tags:    

Similar News