ఎన్టీఆర్ డైలాగులకు ఫ్లాటయిపోయిన రైల్వే శాఖ

Update: 2016-02-17 11:30 GMT
యంగ్ హీరో ఎన్టీఆర్ సినిమా డైలాగులు ఇక నుంచి రైల్వే స్టేషన్లలో మారుమోగుతాయట.... అంటే కేవలం ఎన్టీఆర్ సినిమాలే అక్కడ ప్రదర్శిస్తారనుకుంటే పొరపాటే. విషయం అది కాదు... గతంలో ఎన్టీఆర్ తన హిట్ సినిమా రాఖీలో పలికిన డైలాగుల్లో రైల్వేశాఖకు సంబంధించిన కొన్ని డైలాగులు బాగా పాపులరయ్యాయి. అవి ఇప్పుడు రైల్వే శాఖను కూడా ఆకర్షించాయట. దాంతో వారు రైల్వేల గొప్పదనం తెలిసేలా ఆ డైలాగులను అన్ని రైల్వే స్టేషన్లలో వీలున్నప్పుడంతా వినిపించాలని డిసైడయ్యారట.

రాఖీ చిత్రంలోని ఓ సన్నివేశంలో జూనియర్ రైల్వేస్ గురించి చెప్పిన డైలాగ్ అప్పట్లో భలేగా మారుమోగింది... అయితే ఆ డైలాగ్స్‌నే ఇప్పుడు రైల్వే డిపార్ట్ మెంట్ మెచ్చి వాటిని తమ శాఖకు అనువుగా ఉపయోగించుకోనుందట. 'రాఖీ'లో జూనియర్ ఎన్టీఆర్.. రైల్వేస్ గురించి చెప్పిన డైలాగ్‌ ను రైల్వే శాఖ ఇప్పుడు తమ ప్రచారంలో భాగంగా ఉపయోగించుకోవాలని అనుకుంటోందట. ఇందులోని వాస్తవం ఎంతో తెలియదు కానీ, 'రాఖీ' సినిమా చూసిన రైల్వే శాఖ వారికి అందులో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ భలేగా నచ్చుతాయి... అందుకే కొందరు రైల్వే అధికారులు ఆ డైలాగులను తమ రైల్వే డిపార్ట్ మెంట్ గొప్పతనాన్ని జనానికి చెప్పేందుకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారట... ఆ డైలాగ్స్‌ను ప్రతి రైల్వే స్టేషన్‌ లోనూ రోజులో ఏదో ఒక సమయంలో స్టేషన్స్‌ లోని టీవీల్లో ప్రదర్శించాలని డిపార్ట్ మెంట్ తలపోస్తోంది.
Tags:    

Similar News