రాజమౌళి కలల ప్రపంచం మహిష్మతి రాజ్యాన్ని రకరకాల కోణాల్లో చూశాం. కానీ ఈ రోజు కొత్త కోణంలో చూపించాడు రాజమౌళి. మహిష్మతి రాజ్యాన్ని వర్షంలో చూపించాడు జక్కన్న. మహిష్మతిలో ఇదే తొలి వర్షం అని కూడా చెప్పాడు రాజమౌళి.
ఇంతకీ రాజమౌళి సృష్టించిన మహిష్మతి రాజ్యం ఎక్కడుందో తెలుసు కదా. హైదరాబాద్ శివార్లలోని ప్రపంచ ప్రఖ్యాత స్టూడియో రామోజీ పిలిం సిటీలో. అక్కడ పదుల ఎకరాల్లో ప్రత్యేకంగా మహిష్మతి రాజ్యాన్ని తీర్చిదిద్దుకున్నాడు రాజమౌళి. హైదరాబాద్ లో మంగళవారం చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే మహిష్మతి రాజ్యాన్ని కూడా పావనం చేశాడు వరుణుడు. ఈ మూమెంట్ ని క్యాప్చర్ చేసి తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు రాజమౌళి.
గత ఏడాది సమ్మర్లోనే మహిష్మతి రాజ్యంలో షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఏడాది వర్షా కాలంలో అక్కడ షూటింగ్ మొదలుపెట్టాడు. వర్షం పడింది. బహుశా ఈ వర్షాన్ని కూడా సినిమా కోసం వాడేసుకున్నాడో ఏమో జక్కన్న. పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగాడు కాబట్టి వర్షపు సన్నివేశాలు కూడా తీసినా తీసేసి ఉంటాడేమో.