'పుష్ప' ని దెబ్బేసిన వ‌ర్షం..?

Update: 2021-07-18 00:30 GMT
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో 'ఆర్య' 'ఆర్య 2' చిత్రాల తర్వాత రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా చేయక ముందు ఆగస్టు 13న రిలీజ్‌ చేయాలనుకున్నారు.

కానీ అప్పటికి షూటింగ్ పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో.. 'పుష్ప 1' చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. రెండో భాగాన్ని అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో సుకుమార్ మరో సినిమా చేసి 'పుష్ప 2' పనులు మొదలు పెట్టాలని అనుకున్నారు.

'పుష్ప' పార్ట్-1 కి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ ఫినిష్ అవడంతో.. ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని శరవేగంగా షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని సుక్కూ అండ్ టీమ్ ప్లాన్స్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు వారి ప్లాన్స్ మొత్తం డ్యామేజ్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య హైదరాబాద్ లో కురిసిన వర్షం 'పుష్ప' షూటింగ్ పై దెబ్బేసిందట. దీంతో ఈ సినిమా షూటింగ్ ముగియ‌డానికి మరో రెండు నెల‌ల సమయం ప‌ట్టేలా ఉందని టాక్ వినిపిస్తోంది. ఆగ‌స్ట్ మొద‌టి వారంలో సినిమాని మ‌ళ్లీ సెట్స్ మీద‌కి తీసుకురావాల‌న్న‌ది సుక్కూ అండ్ టీమ్ లేటెస్ట్ ప్లాన్ అని సమాచారం.

కాగా, అల్లు అర్జున్ - సుకుమార్ లకు 'పుష్ప' ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్‌ గా ఊర మాస్‌ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. బన్నీ కి జోడీగా లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్‌ ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News