చిన్న సినిమాలు తీస్తున్నా.. టేస్ట్ ఉన్న మూవీస్ తెరకెక్కిస్తున్నాడంటూ నిర్మాత రాజ్ కందుకూరికి బాగానే గుర్తింపు దక్కుతోంది. పెళ్లిచూపులు అంటూ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీ తీసిన ఈయన.. రీసెంట్ గా మెంటల్ మదిలో అంటూ మరో సక్సెస్ సాధించారు.
లో బడ్జెట్ మూవీగానే తెరకెక్కిన మెంటల్ మదిలో.. కన్ఫ్యూజన్ నేపథ్యంతో సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తను చెప్పదలచుకున్న పాయింట్ కు దర్శకుడు వివేక్ ఆత్రేయ కట్టుబడ్డ తీరు జనాలను కూడా మెప్పించింది. అంతే కాదు.. ఈ దర్శకుడు సినిమా తీసిన తీరు రాజ్ కందుకూరిని తెగ మెప్పించింది. అందుకే అదే దర్శకుడితో మరో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు ఈ నిర్మాత. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టును అనౌన్స్ చేయగా.. దీనికి కూడా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తాడని అఫీషియల్ గా ప్రకటించేశారు.
బ్రోచేవారెవరురా అనే టైటిల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను.. ఓ క్లాసిక్ సాంగ్ నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సారి కూడా లో బడ్జెట్ లోనే మూవీ తీయనున్నారు. బ్రోచేవారెవరురా మూవీని కూడా సురేష్ బాబు భాగస్వామ్యంలోనే నిర్మిస్తారు రాజ్ కందుకూరి. పెళ్లి చూపులు నుంచి ఈ కంబైన్డ్ ప్రొడక్షన్ కొనసాగుతుండడం చెప్పుకోవాల్సిన విషయం.