అనేక మార్లు టాలీవుడ్ లో అంతే.. టాలీవుడ్ లో అంతే అనుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇందుకు కారణం.. ఒక ఫార్మాట్ లో ఓ సినిమా ఆడితే చాలు.. ఇక క్యూ కట్టేస్తాయి. చంద్రముఖి తర్వాత అదే ఫార్మాట్ లో బోలెడన్ని వచ్చాయి. హారర్ కామెడీ అంటూ ప్రేమ కథా చిత్రం ఆడితే.. ఇక అదే టైపులో క్యూ కట్టేశాయి. ఇప్పటివరకూ పూర్తి స్థాయి బయోపిక్ చూసి ఎరుగని టాలీవుడ్ జనాలకు మహానటి మంచి కిక్ ఇచ్చింది.
దీంతో ఇప్పుడు ఫిలిం పర్సనాలిటీల జీవిత చరిత్రలను తిరగేసే పనిలో పడ్డారు పలువురు ఫిలిం మేకర్స్. నిజానికి ఎన్టీఆర్ పై మూవీ ఇప్పటికే సెట్స్ ఎక్కేసినా.. ఆయనను కేవలం సినిమాల కోణంలో మాత్రమే చూడడం కుదరని పని. ఇక వైఎస్సార్.. కేసీఆర్ లపై కూడా బయోపిక్స్ అనౌన్స్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం మహానటి సక్సెస్ చూసి.. తెలుగు సినీ ప్రేక్షకుల మన్నన పొందిన సౌందర్య జీవితాన్ని కూడా రూపొందించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ఆ తర్వాత మెంటల్ మదిలో చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడీయన సౌందర్య లైఫ్ ను ఫిలిమ్ గా మలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ భామ అయినా.. టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించిన సౌందర్య.. రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టి.. ఓ ప్రచార సభకు వెళ్లే సమయంలోనే విమాన ప్రమాదానికి గురై విషాదం మిగిల్చింది. సౌందర్య కథ కూడా తెలుగు ఆడియన్స్ ను మెప్పించే సబ్జెక్టే. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవడమే కాస్త కష్టమైన విషయం.