ఒకే ఒక్క ఛాన్స్ లైఫ్ నే మార్చేస్తుంది. అలాంటి ఛాన్స్ పెళ్లి చూపులు రూపంలో అందుకున్నాడు దేవరకొండ. ఆ సినిమా విజయ్ దేవరకొండ కు సోలో సక్సెస్ ని అందించింది. ఒక నటుడిగా విజయ్ దేవరకొండ కు.. దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కు.. నిర్మాత గా రాజ్ కందుకూరి కి మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. ఆ ఒక్క సినిమాతో ముగ్గురూ పరిశ్రమలో నిలదొక్కుగోలిగారు. దేవరకొండ ప్రస్తుతం ఇండస్ట్రీ బెస్ట్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అలాంటి హీరో జర్నీలో కీలకమైన హిట్ సినిమాని ఇచ్చిన ఘనత రాజ్ కందుకూరికే దక్కుతుంది. బొమ్మరిల్లు స్ఫూర్తితో ఈ సినిమా తీసానని ఆయన చెబుతుంటారు. బొమ్మరిల్లు తరహాలోనే పెళ్లి చూపులు జాతీయ అవార్డులు సైతం అందుకుంది.
ప్రస్తుతం రాజ్ కందుకూరి తన వారసుడు శివ కందుకూరిని `చూసి చూడంగానే` అనే సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శేష సింధూరావు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలోని సినిమా ఇది. ఇటీవల విడుదలైన ప్రచారం చిత్రాలకు రెస్పాన్స్ బావుంది. రాజ్ కందుకూరి స్టోరీ జడ్జిమెంట్ బాగుంటుంది. గతంలో ఆయన నిర్మించిన సినిమాలే ఆయనను ఈస్టేజ్ కు తీసుకొచ్చాయి. అయితే తనయుడి విషయంలో ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? అన్నది తేలాల్సి ఉంది.
పరిశ్రమకి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ ని అందించడంలో కందుకూరి పాత్ర కీలకమైనది. మరి తనయుడిని మరో దేవరకొండని చేస్తాడా? నెప్టోయిజం ఉన్న పరిశ్రమ లో ఒక నిర్మాతగా కుమారుడిని నిలబెట్టగలడా? అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నలుగురిని చిరు నవ్వుతో పలకరిస్తూ అందరితో కలిసిపోయే మంచి స్వభావం ఉన్నవాడు కాబట్టి ఆయన వారసుడికి అందరి నంచి బ్లెస్సింగ్స్ అందుతున్నాయి. ఆయన సన్నిహితులు.. స్నేహితులు పెళ్లి చూపులు రేంజ్ హిట్టు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి శివ కందుకూరి టైమ్ ఎలా ఉందో చూడాలి.