అశ్లీల వీడియోలు తీసిన కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో పక్కా ఆధారాల కోసం ఆరాతీస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక అడుగులు వేస్తున్నారు. అసలు అశ్లీల వీడియోలు ఎక్కడ తీశారు? ఎక్కడ వాటి కాపీలు పెట్టారనే దానిపై ఆరాతీస్తున్నారు.
ముంబైలోని కొన్ని హోటళ్లు, ఫామ్ హౌసుల్లో అశ్లీల సినిమాల షూటింగ్ చేసి.. పెయిడ్ యాప్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.తాజాగా రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేశ్ కామత్ నుంచి 70 అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని వేర్వేరు ప్రొడక్షన్ హౌస్ ల సాయంతో వాటిని ఉమేశ్ షూట్ చేసినట్లు పోలీసులు విచారణ అనంతరం తెలిపారు.
ఈ వీడియోలను ఇప్పటికే రాజ్ కుంద్రా యూకేలోని తనకంపెనీ కిన్ రిస్ ద్వారా అశ్లీల యాప్స్ లో రిలీజ్ చేశాడా? లేదా అనేది తెలుసుకునేందుకు వాటిని ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు పంపనున్నారు.
రాజ్ కుంద్రాను జూలై 23 వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో వారందరికీ నోటీసులు పంపి వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకుంటామన్నారు.
విచారణలో పక్కా ఆధారాలు సేకరించి.. అతడితోపాటు ఈ కేసులో నిందితులందరికీ శిక్ష పడేలా చేస్తామని ముంబైపోలీసులు తెలిపారు.మరోవైపు ఇప్పటివరకు రాజ్ కుంద్రాతోపాటు అతడి నుంచి రెగ్యూలర్ పేమంట్స్ అందుకున్న పలువురి బ్యాంక్ అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సుమారు రూ.7 కోట్లకు పైగా డబ్బు ఆ ఖాతాల్లో ఉన్నట్లు చెప్పారు.