రాజ్ కుంద్రా కేసు: విచారణలో శిల్పాశెట్టి సంచలన నిజాలు

Update: 2021-07-24 16:30 GMT
బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఇప్పుడు అందరి చూపు శిల్పాషెట్టిపై పడింది. భర్త ఇంత చేస్తున్నా.. ఆమె ప్రమేయం లేదంటారా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. భర్త చేస్తున్న వ్యాపారాల గురించి కట్టుకున్న భార్యగా శిల్పాషెట్టికి తెలియదా? ఆమె ప్రమేయం లేదా? అన్నది ఆలోచించాల్సిందేనని ముంబై సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ముంబైలోని జుహులో ఉన్న శిల్పాశెట్టి నివాసంలో ఆమెను పోలీసులు విచారించారు. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ నటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని శుక్రవారం సాయంత్రం విచారించి.. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.

విచారణ సందర్భంగా తన భర్త రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి వెనకేసుకొచ్చినట్టు  మీడియాలో వార్తలు వస్తున్నాయి.  రాజ్ కుంద్రా అమాయకుడని.. 'ఎరోటికా'కు 'అశ్లీల వీడియోల'కు తేడా ఉందని.. 'ఎరోటికా' అశ్లీలం కాదని శిల్పా విచారణలో తెలిపినట్టు సమాచారం.

యాప్ నిర్వహణ అంతా లండన్ లో ఉన్న రాజ్ కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదేనని శిల్పాశెట్టి చెప్పినట్టు సమాచారం.  తన భర్త రాజ్ కుంద్రా నిర్ధోషి అని శిల్పా క్రైమ్ బ్రాంచ్ కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ఇక హాట్ సాట్ యాప్ లోని కంటెంట్ కు, తనకు దాని గురించి ఏమీ తెలియదని పేర్కొన్నట్టు చెబుతున్నారు. తనకు హాట్ షాట్ తో సంబంధం లేదని.. తన భర్త రాజ్ కుంద్రాకు ఆ అశ్లీల కంటెంట్ కు ప్రొడక్షన్ లో పాల్గొనలేదని ఆమె చెప్పారట.. ఆ మెటీరియల్ తయారీలో పాల్గొనలేదని ఆమె చెప్పినట్టు తెలిసింది. ఈ విచారణలో తన భర్తను శిల్పా వెనకేసుకొచ్చినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News