బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా యాప్ ల ద్వారా నీలిచిత్రాలను సృష్టించి పంపిణీ చేసారన్న ఆరోపణలపై గత ఏడాది జూలైలో అరెస్టయిన ఉదంతం తెలిసిందే.
సోషల్ మీడియా- ఇంటర్నెట్ లో ఇదే విషయమై రకరకాల కథనాలు వెలువెడ్డాయి. శిల్పాకు ఈ కేసుతో సంబంధం లేకపోయినా రాజ్ కు అన్ని విధాలుగా తన మద్దతును అందిస్తూ ఆమె పెదవి విప్పలేదు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత కుంద్రా తన మౌనాన్ని వీడి మొదటిసారి వివాదంపై స్పందించాడు.
బుధవారం నాడు రాజ్ కుంద్రా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ట్రోలర్లపై చెలరేగిన ఒక క్యాప్షన్ ఫోటోను పంచుకున్నాడు. ఏడాది క్రితం ఇదే రోజున తాను విడుదలయ్యానని ప్రస్తావిస్తూ - "ఈరోజుకి #అర్థర్ రోడ్ నుండి విడుదలై ఏడాది. ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ న్యాయం జరుగుతుంది! నిజం త్వరలో బయటపడుతుంది! శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నన్ను బలపరిచిన ట్రోలర్ లకు పెద్ద కృతజ్ఞతలు" అని వ్యాఖ్యను జోడించాడు. అలాగే ముసుగు ధరించిన కుంద్రా సెల్ఫీ ఫోజ్ ని కూడా షేర్ చేసాడు. "మీకు మొత్తం కథ తెలియకపోతే... నోరు మూసుకో!!!" అంటూ ఘాటైన కౌంటర్ వేసాడు ట్రోలర్లపై.
కుంద్రాను సైబర్ క్రైమ్ పోలీసులు జూలై 19న అరెస్టు చేశారు. IPC మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతను ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్నాడు. PTI యొక్క నివేదిక ప్రకారం.. రాజ్ పై ఆరోపణల ప్రకారం.. ఏదైనా ద్రవ్యం లేదా ఇతర రకాల లాభం పొందినట్లు పోలీసులు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. ప్రాసిక్యూషన్ కొనసాగుతోంది.
మాస్కులు విడువడం లేదు!చాలా కాలంగా పబ్లిక్ లో రాజ్ కుంద్రా తన ముఖాన్ని వింతైన నల్లని మాస్క్ లు హెల్మెట్ లతో కప్పుకుంటున్నాడు. దీనికి ఫోటోగ్రాఫర్లు కూడా అలవాటు పడ్డారు. ఇప్పటికీ సోషల్ మీడియాల్లో ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూనే ఉన్నాడు అతడు.
పలువురు నటీమణులను నీలి చిత్రాల రాకెట్ లోకి బలవంతంగా దించారనే ఆరోపణలు కుంద్రాపై వెల్లువెత్తాయి. దీనిపై కొందరు నాయికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై ముంబై పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. పలువురు ఔత్సాహిక నటీమణులకు వెబ్ సిరీస్ లలో పాత్రలు ఇస్తామని వాగ్దానం చేసినా.. అందుకు భిన్నంగా సెట్స్ లో స్క్రిప్ట్ మార్చి బెదిరించి నీలిచిత్రాల యాప్ ల కోసం షూటింగుల చేశారని కొందరు ఆరోపించారు. కుంద్రాపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. అయితే శిల్పా శెట్టి తిరిగి తన అవకాశాలను మెరుగుపరుచుకున్నారు. భర్తకు పూర్తి మద్ధతుగా నిలుస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

One Year Today released from #ArthurRoad Its a matter of time Justice will be served! The truth will be out soon! Thank you well wishers and a bigger thank you to the trollers you make me stronger