కరోనా లాక్డౌన్ లో అన్ని సినిమాల షూటింగ్ లు బంద్ అయిపోయి అందరూ ఇంట్లోనే సేదతీరారు. ఆ టైంలో భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా అందరూ అశ్లీల వీడియోలు చూశారని సర్వేలు ఘోషించాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా రాజ్ కుంద్రా తన బిజినెస్ ను బాగా రన్ చేశాడని.. ఏకంగా 100 అశ్లీల సినిమాలు తీశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అశ్లీల చిత్రాలు తీశాడనే ఆరోపణలపై అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారంలో తవ్వే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే లాక్ డౌన్ లో ఆయన ప్రజల ఖాళీ టైంను క్యాష్ చేసుకుందని భారీగా అశ్లీల చిత్రాలు తీసిన విషయం తాజాగా బయటకొచ్చింది.
లాక్ డౌన్ ఉన్న ఏడాదిన్నర కాలంలో రాజ్ కుంద్రా 100 అశ్లీల చిత్రాలు తీశాడట.. ఆ సినిమాల్ని రకరకాల సామాజిక మాధ్యమాల్లో పెట్టి కోట్ల రూపాయలు ఆర్జించాడట.. అలా కరోనా టైంలో అంతా ఖాళీగా ఇళ్లలో కూర్చుంటే.. రాజ్ కుంద్రా మాత్రం రెండు చేతులారా సంపాదించినట్టు భోగట్టా.
ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా క్లూస్ టీంతో కలిసి రాజ్ కుంద్రా, శిల్పాషెట్టి ప్రధాన నివాసంలో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను సేకరించారట.. ఇక ముంబైలోనే మరో రెండు ప్రాంతాల్లో ఉన్న రాజ్ కుంద్రా గెస్ట్ హౌస్ లను సోదా చేసి కీలకమైన హార్డ్ డెస్క్ లతోపాటు లాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కుంద్రా అరెస్ట్ పై స్పందించిన షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండే లాంటి శృంగార తారలను కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారట.. వారి నుంచి కూడా వివరాలు రాబట్టాలని యోచిస్తున్నారట..
మరో వైపు కుంద్రా బెయిల్ పిటీషన్ ను కూడా కోర్టు మరోసారి తిరస్కరించిందట.. ఈనెల 27వరకు రిమాండ్ పొడిగించిందట.. ఈ 3 రోజుల్లో రాజ్ కుంద్రా నుంచి పోలీసులు విలువైన సమాచారాన్ని రాబట్టేందుకు విస్తృతంగా సోదాలు, విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.