షెర్లిన్ చోప్రాపై శిల్పాశెట్టి & రాజ్ కుంద్రా 50కోట్ల పరువు నష్టం దావా?

Update: 2021-10-19 17:30 GMT
బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై బాలీవుడ్ సినీ కపుల్  రాజ్ కుంద్రా -శిల్పా శెట్టి పరువు నష్టం దావా వేశారు. శిల్పా -రాజ్ కుంద్రాపై ఇటీవల షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపులు.. నేరపూరిత బెదిరింపుల ఆరోపణలు చేశారు. రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్యవహారంపై షెర్లిన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  మిస్టర్ -మిసెస్ కుంద్రా తరుపున ఆమె న్యాయవాదులు షెర్లిన్‌ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

షెర్లిన్ చోప్రా జుహు పోలీస్ స్టేషన్‌లో వ్యాపారవేత్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఈ ఆరోపణలు చేసింది. తాజా నివేదికల ప్రకారం.. శిల్పా -రాజ్ లు తమపై చేసిన ఆరోపణలకు 'ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని.. కల్పిత, తప్పుడు, నకిలీ, పనికిమాలిన, నిరాధారమైనవిగా తేలితే మాత్రం చట్టప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

షెర్లిన్ తమ పరువు తీసేందుకు.. దోపిడీ చేయడానికి ఉద్దేశపూర్వక ఆరోపణలు చేసినట్లు ఆ జంట తరపు న్యాయవాదులు తెలిపారు. అశ్లీల స్ట్రీమ్ యాప్ పని వ్యవహారాలలో శిల్పా శెట్టికి సంబంధం లేదని నోటీసులో పేర్కొన్నారు. "అవాంఛిత వివాదాలను సృష్టించడానికి.. మీడియా దృష్టిని ఆకర్షించడానికి  శిల్పా శెట్టి పేరును లాగడానికి ఇది షెర్లిన్ చేసిన  ప్రయత్నం తప్ప మరొకటి కాదు" అని నోటీసుల్లో పేర్కొన్నారు.

"షెర్లిన్ చోప్రాను నోడల్ సైబర్ పోలీస్ స్టేషన్‌లోని సిఆర్ నంబర్ 02/2020 లో నిందితురాలిగా పేర్కొన్నారు. షెర్లిన్ చోప్రా ఇండియన్ పీనల్ కోడ్, 1860 యొక్క u/s 499, 550, 389 మరియు 195 (A) నేరాలకు పాల్పడింది. మాకు భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. మేము షెర్లిన్ చోప్రాపై సివిల్/క్రిమినల్ విచారణలను ప్రారంభిస్తాము. న్యాయస్థానం ముందు న్యాయం కోసం. మేము షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువునష్టం దావా వేశాం’ అని నోటీసులో పేర్కొన్నారు.

ఒక వారం క్రితం శిల్పా శెట్టి -రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేయడానికి నటి షెర్లిన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది. అడల్ట్ ఫిల్మ్స్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుంచి షెర్లిన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ - ఇంటర్వ్యూల ద్వారా మిస్టర్ అండ్ మిసెస్ కుంద్రాపై విరుచుకుపడింది.
Tags:    

Similar News