ఈసారైనా రాజ్ తరుణ్ కి హిట్ వస్తుందా?

Update: 2019-10-09 04:21 GMT
హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న యువహీరోలలో రాజ్ తరుణ్ ఒకరు.  చివరిగా హిట్ అయిన రాజ్ తరుణ్ సినిమా ఏదో చెప్పమని ఒక ప్రశ్న అడిగితే అరివీర భయంకరమైన తెలుగు సినిమా అభిమాని కూడా కాసేపు తడుముకోవాల్సిందే. అలా ఉంది పరిస్థితి.  అయితే రాజ్ తరుణ్ మాత్రం ఆ అపజయాలతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.  దసరా సందర్భంగా రాజ్ తరుణ్ తాజా చిత్రం 'ఇద్దరిలోకం ఒకటే' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఎప్పటిలాగే ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

జి.ఆర్. కృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు.  హీరోయిన్ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే.  మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.  రాజ్ తరుణ్ కు ఇప్పుడు హిట్ చాలా అవసరమే కానీ దిల్ రాజు బ్యానర్ లో ఈమధ్య విజయాల శాతం తగ్గింది. పైగా పబ్లిసిటీ విషయంలో దిల్ రాజు కాంపౌండ్ చాలా వీక్.  సినిమాకు హిట్ టాక్ వస్తే దాంతో ప్రేక్షకులు వారంతట వారే చూడాల్సిందే కానీ ప్రమోషన్స్ అగ్రెసివ్ గా చేయడం లాంటివి ఉండవు.  నిజానికి దిల్ రాజు సినిమాలన్నిటికీ మొదటి నుంచి ఇదే సూత్రం ఫాలో అవుతూ వస్తున్నారు. రాజ్ తరుణ్ దిల్ రాజు బ్యానర్ లో చేసిన లాస్ట్ సినిమా 'లవర్' పరిస్థితి ఒక సారి గుర్తు చేసుకుంటే ఆ విషయం అర్థం అవుతుంది. ఆ సినిమాను పబ్లిసిటీ చేయకుండా మొదటి రోజే చేతులెత్తేసినందువల్ల మొత్తానికి కిల్ అయిపోయిందనే టాక్ ఉంది.  ఇప్పుడు మరోసారి రాజుగారి బ్యానర్ లో సినిమా అంటే పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉండదు అని  ఫిక్స్ అయిపోవచ్చు.

సినిమా అద్బుతం అయితే  రాజుగారి పాలసీ వర్క్ అవుట్ అవుతుంది కానీ యావరేజ్ కంటెంట్ అయితే మాత్రం పబ్లిసిటీ సపోర్ట్ తప్పనిసరి.  ఇక్కడ మరో చిక్కేంటంటే రాజ్ తరుణ్ మార్కెట్ దాదాపుగా వీక్ అయింది.  ఈ సమయంలో గట్టిగా ప్రమోషన్స్ చేస్తే గానీ ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు.  ఈమధ్యే రిలీజ్ అయిన గోపిచంద్ 'చాణక్య' పరిస్థితి ఎలా ఉందో అందరూ చూశారు.  ప్రోమోస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ప్రమోషన్స్ వీక్ కావడంతో ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడింది.  దసరా సీజన్లో రిలీజ్ అయిన సినిమా పరిస్థితే ఇలా ఉంటే రాజ్ తరుణ్ సినిమాకు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి 'ఇద్దరిలోకం ఒకటే' విషయంలో ఇలాంటివి అన్నీ సరిగ్గా వర్క్ అవుట్ అవుతాయా.. ఈ సారైనా హిట్ దక్కుతుందా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News