యంగ్ డైనమిక్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ జెట్ స్పీడ్ అందుకున్నట్టే. అతడు నటించిన మూడు సినిమాలన్నీ ఒకే వరుసలో రిలీజై అన్నీ హిట్ కొట్టాయి. ఉయ్యాల జంపాలతో మొదటి విజయం అందుకుని, ఆ వెంటనే సినిమా చూపిస్త మావతో మరో క్లాసిక్ హిట్ అందుకున్నాడు. లేటెస్టుగా కుమారి 21 ఎఫ్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూడు సినిమాలతో రాజ్ తరుణ్ రేంజ్ స్కై లోకి వెళ్లిపోయిందని చెబుతున్నారు.
ఇప్పుడున్న నవతరం హీరోల్లో రాజ్ తరుణ్ తనని తాను ప్రామిస్సింగ్ హీరోగా ప్రూవ్ చేసుకుని రేసులోకి వచ్చాడు. నాని, నిఖిల్ - సందీప్ కిషన్ - నాగశౌర్య ఇప్పుడున్న కుర్రాళ్లలో లీడింగ్ స్టార్స్. 30 లోపు వయసుతో వాడిగా వేడిగా సినిమాలు చేస్తోంది వీళ్లు మాత్రమే. అందుకే ఈ రేసులో ఎంటర్ అయిన హీరోగా రాజ్ తరుణ్ పాపులర్ అయ్యాడు. ఇప్పటికిప్పుడు రాజ్ తరుణ్ వెంట బడా బ్యానర్స్ అన్నీ వెంటపడుతున్నాయి. మాకో సినిమా చేసిపెట్టు గురూ.. అంటూ అడుగుతున్నాయి. రేసులో గీతా ఆర్ట్స్ - 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సినిమాలకు ఇప్పటికే సంతకం చేసేశాడు. మూడే మూడు సినిమాలతో అతడి రేంజు కోటికి పాకిందని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం సంస్థను బట్టి రూ.75 లక్షల నుంచి 1 కోటి వరకూ డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఒక సూపర్ హిట్ హీరోకి ఆ మొత్తం చాలా తక్కువే. ప్రస్తుతం రాజ్ తరుణ్ రేంజ్ అంతకుమించి. లాభాలొస్తే కోట్లలో దండుకునేది నిర్మాతే. హిట్టు హీరో అనే ట్యాగ్ ని వాడుకుని డిస్ర్టిబ్యూటర్ల నుంచి రిలీజ్ కి ముందే లాగేస్తారు కాబట్టి... రాజ్ తరుణ్ ఆ మాత్రం డిమాండ్ చేస్తే తప్పేం లేదేమో.