హిలేరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ గా రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' టీజర్..!

Update: 2021-07-09 11:16 GMT
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''స్టాండ్ అప్ రాహుల్''. 'కుర్చుంది చాలు' అనేది దీనికి ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'జాను' ఫేమ్ వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్పటికే విడుదలైన రాజ్ తరుణ్ - వర్ష ఫస్ట్ లుక్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'స్టాండ్ అప్ రాహుల్' టీజర్ ను రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర యూనిట్ కి విషెస్ అందించారు.

'హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ బ్రో' అనే లైన్ ని చూపిస్తూ.. రాజ్ తరుణ్ ఓ స్టేజ్ పై మాట్లాడుతుండటంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. స్టాండ్-అప్ కామెడీకి ఒరిజినాలిటీ అనేది చాలా ముఖ్యమైనదని ఓ స్టాండ్-అప్ కమెడియన్ చెప్తున్నాడు. అయితే రాజ్ తరుణ్ మాత్రం కుళ్లు జోకులు చెప్తూ తన చుట్టూ ఉన్నవారిని విసుగు తెప్పిస్తున్నట్లు అర్థం అవుతోంది. 'మొఘల్ రాజు యుద్ధానికి వెళ్తే కత్తి కనిపించలేదు.. ఎందుకంటే అది ఔరంగ జేబులో ఉండిపోయింది కాబట్టి' అంటూ చెప్పే డైలాగ్ ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. పెళ్లి అంటే ట్రస్ట్ అని చెప్పే వర్షా బొల్లమ్మను రాజ్ తరుణ్ ఎక్కువగా విసిగిస్తున్నట్లు తెలుస్తోంది.

'పిల్లల్ని కనడానికి తప్ప మగాళ్లు అవసరం లేదని ప్రియాంక చోప్రా అంటే అందరూ ఈలలు వేశారు. అదే మా చలపతిరావు అంటే గోల గోల చేశారు.. ఒక అబ్బాయి సింగిల్ గా ఉంటే పులి అవుతాడు. అదే అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు' అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. ఇందులో వెన్నెల కిషోర్ ఒక హిలేరియస్ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మురళి శర్మ - ఇంద్రజ - దేవి ప్రసాద్ - మధురిమ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. జీవితంలో దేనికోసం నిలబడని ఓ యువకుడు.. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాక.. తన తల్లిదండ్రుల కోసం.. ప్రేమ కోసం మరియు స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్న మక్కువ కోసం ఎలా నిలబడ్డాడు అనేదే ''స్టాండ్ అప్ రాహుల్'' కథ అని తెలుస్తోంది.

'స్టాండ్ అప్ రాహుల్' టీజర్ ఫ్రెష్ గా ఉండటంతో పాటుగా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. రాజ్ తరుణ్ - వర్ష బొల్లమ్మ తమ నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు శాంటో ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ తో ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నారని అర్థం అవుతుంది. సిద్ధు ముద్దా సమర్పణలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నంద్‌ కుమార్ అబ్బినేని - భ‌ర‌త్ మాగులూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తుండగా.. శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News