మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’లో నటించిన ముగ్గురు హీరోయిన్లూ కుర్రాళ్ల మనసు దోచారు. అందులో హీరో టీనేజ్ లవ్ స్టోరీలో లీడ్ రోల్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. మొత్తం సౌత్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. ఆల్రెడీ తెలుగులో ఆమెకు రెండు బంపర్ ఆఫర్లు తగిలాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రేమమ్’ రీమేక్ లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఒరిజినల్లో పోషించిన పాత్రనే ఇక్కడా చేస్తోంది. మరోవైపు మాస్ రాజా రవితేజ పక్కన హీరోయిన్ గానూ అనుపమ ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో ధనుష్ లాంటి స్టార్ హీరోతో కూడా ఓ సినిమాకు కమిటైన అనుపమను లేటెస్టుగా.. ఇంకో మంచి అవకాశం వరించింది.
దిల్ రాజు బేనర్లో సినిమా చేయబోతోంది అనుపమ. రైటర్ కమ్ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ‘శతమానం భవతి’ అనే సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుపమే హీరోయిన్ గా ఎంపికైంది. రాజు బేనర్లో చేసిన హీరోయిన్లకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి.. అనుపమకు ఇది చాలా మంచి అవకాశమనే చెప్పాలి. రాజ్ తరుణ్ కూడా లక్కీ హీరోగా ముద్ర పడ్డాడు. నిజానికి ఈ కథను సాయిధరమ్ తేజ్ కోసం అనుకున్నారు. కానీ అనుకోకుండా రాజ్ తరుణ్ లైన్ లోకి వచ్చాడు. ఇంతకుముందు దర్శకుడిగా రామదండు - దొంగలబండి లాంటి సినిమాలు తీసిన సతీశ్.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ సక్సెస్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.