'పవర్‌ ప్లే' తో స్పీడ్ తగ్గించిన బుజ్జిగాడు

Update: 2021-07-04 00:30 GMT
ఎన్నో యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్ ల్లో నటించి మెప్పించి విభిన్నమైన నటుడిగా పేరు దక్కించుకున్న రాజ్ తరుణ్‌ కు హీరోగా ఉయ్యాల జంపాల సినిమాతో మంచి పేరు దక్కింది. మొదటి సినిమా తోనే మంచి నటుడిగా ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న రాజ్ తరుణ్‌ ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ తో ఒక్కసారిగా మాస్ హీరోగా పేరు దక్కించుకుని జూనియర్ మాస్ మహారాజ్‌ అనే బిరుదును దక్కించుకున్నాడు. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్‌ సినిమా తో హ్యాట్రిక్ దక్కించుకున్న రాజ్ తరుణ్‌ కెరీర్‌ లో డౌన్ ఫాలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తో మొదలు అయ్యింది.

ఆ తర్వాత ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఉన్నా కూడా పెద్దగా సక్సెస్ లను ఈ హీరో దక్కించుకోలేక పోయాడు. అయిదు సంవత్సరాల తర్వాత ఒరేయ్‌ బుజ్జిగ సినిమాతో పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా తో మళ్లీ రాజ్‌ తరుణ్‌ బిజీ అవుతాడని అంతా భావించారు. ఓటీటీ ద్వారా విడుదల అయిన ఆ సినిమా కు విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వం వహించాడు. ఒరేయ్‌ బుజ్జిగ సినిమా సక్సెస్ నేపథ్యంలో వెంటనే మరో సినిమాను వీరిద్దరు కలిసి చేశారు.

రాజ్ తరుణ్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో రూపొందిన పవర్‌ ప్లే సినిమా నిరాశ పర్చింది. ఓటీటీ ద్వారా డైరెక్ట్‌ స్ట్రీమింగ్ అయిన ఆ సినిమా నిరాశ పర్చడంతో రాజ్ తరుణ్‌ మళ్లీ స్లో అయ్యాడా అనే అనుమానం కలుగుతుంది. కరోనా మొదటి వేవ్‌ ముగిసిన వెంటనే స్పీడ్ గా సినిమా ను చేసిన రాజ్ తరుణ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత మాత్రం పెద్దగా సందడి చేయడం లేదు.

ఇప్పటికే ఈయన స్టాండప్‌ రాహుల్‌ అనే సినిమాను ప్రకటించాడు. సంతో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా షూటింగ్‌ అప్‌ డేట్ ఏమీ ఇవ్వడం లేదు. రాజ్ తరుణ్ అసలు ఈ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అయ్యాడా లేదా అనే విషయం లో క్లారిటీ ఇవ్వలేదు. ఒరేయ్‌ బుజ్జిగ సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈయనతో సినిమాలకు పలువురు దర్శకులు ట్రై చేస్తున్నారట. కాని ఈయన మాత్రం ఇంతకు ముందు ఉన్నంత స్పీడ్‌ తో కొత్త సినిమాలను కమిట్‌ అవ్వడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.

కరోనా సెకండ్ వేవ్‌ తర్వాత యంగ్‌ హీరోల్లో దాదాపు చాలా మంది షూటింగ్ లను పునః ప్రారంభించారు. కాని రాజ్ తరుణ్‌ మాత్రం కొత్త సినిమా అప్ డేట్ ను ఇవ్వడం లేదు అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవర్‌ ప్లే దెబ్బ వల్లే ఈ బుజ్జిగాడు కాస్త తగ్గి సినిమాలు చేస్తున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News