బ్ర‌హ్మీ వార‌సుడు ఎందుకీ స్ట్ర‌గుల్‌?

Update: 2018-09-11 04:31 GMT
హాస్య బ్ర‌హ్మీ అలియాస్‌ బ్ర‌హ్మానందం వార‌సుడు రాజా గౌత‌మ్ న‌టించిన `మ‌ను` ఇటీవ‌ల రిలీజైన సంగ‌తి తెలిసిందే. మ‌రో మూడు సినిమాలతో పోటీప‌డుతూ ఈ థ్రిల్ల‌ర్ సినిమా రిలీజైంది. క్రౌడ్ ఫండెడ్ ఫార్మాట్‌ లో కోటి బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. టెక్నిక‌ల్‌ గా ఈ సినిమాని గొప్ప‌గా తీశామంటూ రాజా గౌత‌మ్ & టీమ్ ప‌దే ప‌దే చెప్పేస‌రికి ఈ సినిమాలో ఏదో సంథింగ్ ఉంద‌నే భావించారంతా. కానీ రిజ‌ల్ట్ ఏదైనా డిసైడ్ చేస్తుందిక్క‌డ‌.

ఏ సినిమా అయినా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంది, క‌లెక్ష‌న్ల ప‌రంగా ఆశాజ‌న‌క‌మైన ఫ‌లితం అందుకుంటేనే వాళ్లు చెప్పింది నిజం అని అర్థం. మ‌ను టెక్నిక‌ల్‌గా బావున్నా ఎందుక‌నో వసూళ్ల‌లో ఫెయిలైంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ప‌రంగానూ వీక్ కావ‌డంతో ఆ మేర‌కు అది క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపించింద‌ని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. రాజా గౌత‌మ్ బాగా న‌టించాడు. కానీ ఏం లాభం స‌రైన ప్ర‌మోష‌న్ లేక‌పోతే నెగ్గుకొచ్చే రోజులు కావ‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ఇక‌పోతే బ‌సంతి లాంటి చ‌క్క‌ని చిత్రంలో న‌టించినా రాజా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌బ‌డ్డాడు.

క‌నీసం ఈసారైనా `మ‌ను`తో హిట్ కొడ‌తాన‌ని మీడియాకి ధీమాగా చెప్పాడు. కానీ కెరీర్‌ లో మ‌రో ఫ్లాప్ డిక్లేర్ అయ్యింది. ఇటీవ‌ల యువ‌హీరోల్ని ఓవ‌ర్సీస్ ఆదుకుంటున్న వేళ అమెరికాలో మ‌ను చిత్రాన్ని భారీగా రిలీజ్ చేశారు. కానీ `మ‌ను` చిత్రానికి ఓవ‌ర్సీస్‌ బాలేద‌న్న రిపోర్ట్ వ‌చ్చింది. అయితే, ఇలాంటి స‌న్నివేశంలోనూ ప్ర‌మోష‌న్స్ ప‌రంగా అత‌డి సినిమాల‌కు బ్ర‌హ్మీ ఎందుకు స‌పోర్ట్ చేయ‌డం లేదు? గ‌త సినిమాల‌కు ప్ర‌చారం చేసినా, ఈసారి రాక‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? క‌్రౌడ్ ఫండ్ సినిమా అన్నారు కాబ‌ట్టి, సాయం చేయొచ్చు క‌దా? ఇక‌పోతే రాజా గౌత‌మ్ నెక్ట్స్ ఏంటి? అన్న‌దానికి ఇంకాస్త ఆగితే కానీ స‌మాధానం చెప్ప‌లేం. హిట్టు వెంట‌ప‌డే ప‌రిశ్ర‌మ‌లో ఫ్లాపుల‌తో నెట్టుకెళ్ల‌డం క‌ష్ట‌మే. దీనిని రాజానే విశ్లేషించుకుని బ‌రిలో దిగాలి.
Tags:    

Similar News