లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం వారసుడిగా పరిశ్రమలో ప్రవేశించారు రాజా గౌతమ్. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో `పల్లకిలో పెళ్లికూతురు` చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేశారు. తొలి సినిమా చక్కని విజయం అందుకుంది. అయితే ఆ తర్వాత గౌతమ్ కెరీర్ మాత్రం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ హిట్టు దక్కలేదు. హిట్టు డిసైడ్ చేసే పరిశ్రమలో చాలానే ఒడిదుడుకులు ఎదుర్కొని కెరీర్ ని తిరిగి గాడిలో పెట్టేందుకు సీరియస్ గానే ప్రయత్నాలు సాగిస్తున్నా అవేవీ వర్కవుట్ కావడం లేదు.
ఇదివరకూ `బసంతి` లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఆ సినిమాకి రాజా గౌతమ్ స్నేహితుడే నిర్మాత. బ్రహ్మానందం సపోర్ట్ ఉందని చెబుతారు. అయితే ఆ సినిమా నటుడిగా గౌతమ్ కి పేరు తెచ్చిందే కానీ, కమర్షియల్ గా డబ్బు తేలేదు. అందుకే ఆ కసితోనే ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా సినిమా చేశామని ఈసారి ష్యూర్ షాట్ గా హిట్టు కొట్టి తీరతానని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత రాజాగౌతమ్ నటించిన `మను` చిత్రం ఈ శుక్రవారం (ఈనెల 7న) రిలీజవుతున్న సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో మీడియాతో ముచ్చటించిన గౌతమ్ పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు.
మీ సినిమాలో నాన్నగారి ప్రమేయం ఎంత? ఆయన సలహాలుంటాయా? అన్న ప్రశ్నకు .. నాన్నగారు నా విషయాల్లో ఇన్వాల్వ్ కారని తెలిపారు. గత కొంతకాలంగా నేను వెళుతున్నాను. ఇంటికొస్తున్నాను. దీంతో వీడు ఏదో చేస్తున్నాడు అని మాత్రం అనుకున్నారు నాన్న. క్రౌడ్ ఫండింగ్‌తో మను చిత్రంలో నటించాను. జనం సొమ్ములతో సినిమా కాబట్టి బాధ్యత పెరిగింది. ఒక్క రూపాయి అయినా వృధా కాకూడదని భావించి ఎంతో జాగ్రత్తగా చేశాను. ఈ సినిమాని కేవలం కోటి బడ్జెట్ తో తీశాం. ప్రతి పైసా తెరపై కనిపిస్తాయి. టెక్నికల్‌గానూ అద్భుతంగా ఉంటుంది. నా లైఫ్ లో మను అనే సినిమా ఉంది అని చెప్పుకునేంత గొప్ప ప్రయత్నం చేశాను. కసిగా పంతంతో చేశాను. విశ్వ సినిమాటోగ్రఫీ హైలైట్ గా ఉంటాయి. ఇందులో ఒక ఆర్టిస్టు (పెయింటర్) గా కనిపిస్తాను. నా పాత్రలో గ్రేషేడ్ ఉందా లేదా? కథలో ట్విస్టేంటో తెరపైనే చూడండి అని అన్నారు గౌతమ్.