న్యూ జెనరేషన్ మేకర్స్ టాలీవుడ్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దానికి తోడు ప్రేక్షకులు కూడా సినిమాలో కంటెంట్ ఉంటే చాలు.. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే తేడా లేకుండా హిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక యంగ్ టీమ్ రూపొందించిన 'రాజావారు రాణిగారు' టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు దర్శకుడు రవికిరణ్ కోలా. సినిమాలో కిరణ్ అబ్బవరం.. రహస్య గోరక్..రాజ్ కుమార్.. యజుర్వేద్ గుర్రం.. స్నేహ మాధురి శర్మ.. దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మించారు.
ఇంట్రో అయిపోయింది కాబాట్టి డైరెక్ట్ గా టీజర్ లోకి వెళ్దాం.. ఒక పల్లెటూరు. అందులో ఒక ప్రేమ కథ. అయితే దీన్ని వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తూ చెప్పించారు. పాత కాలంలో ఒక రిక్షాపైన వెళ్తూ మైక్ లో సినిమా ప్రచారం చేసేవారు.. ఆ స్టైల్ లో "ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. నూతన నటీనటులు.. సాంకేతిక నిపుణులచే తీర్చిదిద్దబడినటువంటి ఈ చక్కని చిత్రం పరిచయార్థం ఈ బుర్రకథా పారాయణం" అంటూ బుర్రకథ స్టైల్ లో ఒక్కో పాత్రను పరిచయం చేశారు. ఇక చూసుకోండి.. "అనగనగా శ్రీరామపురం అనే రాజ్యంలో.." అంటూ బుర్రకథ చెప్పినట్టే చెప్పించారు. రాజు.. రాణి.. రాజుకు వెన్నంటే ఉండే స్నేహితులను పరిచయం చేశారు. ఇక హీరో నాన్నగారు ఏం చేస్తారు.. ఫ్రెండ్స్ పేరెంట్స్ ఏం చేస్తారో చూపించారు. "రాజుగారి తండ్రేమో ఆరెంపీ డాక్టరు" అనగానే ఆయన ఒక వ్యక్తి తల గాయానికి కట్టు కడుతూ "ఏరా.. మీరు కాలేజికి పోరా.. పరిక్షలకు వస్తే చాలు అనే కాలేజి అదేం కాలేజిరా (బీప్) కాలేజి" అంటూ తన కోపాన్ని దాచుకోకుండా ప్రదర్శిస్తాడు.
పాత్రలు... ఆ పల్లెటూరి వాతావరణం న్యాచురల్ గా అనిపిస్తున్నాయి. చౌదరి పాత్ర నాన్నగారు "పెసిడెంటు గారబ్బాయి పెయిలైపొయినాడంటే ఎంత ఎదవ పేర్రా" అంటూ తిట్టే సీన్ లాంటివి చాలా సహజంగా ఉన్నాయి. ఫైనల్ టచ్ "ఈ సత్కథా నామమేమి?" అంటూ 'రాజావారు రాణిగారు' అంటూ ఎండ్ చేయడం కూడా కరెక్ట్ గా కుదిరింది. ఓవరాల్ గా టీజర్ ను బ్రిలియంట్ గా ప్రెజెంట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఆలస్యం ఎందుకు.. సరదాగా ఒక లుక్కేయండి..
Full View