నాని రిలీజ్ చేసిన ఫన్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ 'రాజా విక్రమార్క' ట్రైలర్..!

Update: 2021-11-01 12:17 GMT
'Rx 100' ఫేమ్ కార్తీకేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''రాజా విక్రమార్క''. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ లుక్ - టీజర్ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేయబడింది.

హోమ్ మినిస్టర్ ని ఓ పెద్ద ప్రమాదం నుంచి కాపాడటానికి సీక్రెట్ మిషన్ మీద వెళ్లిన NIA అధికారికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేదే 'రాజా విక్రమార్క' సినిమా అని ట్రైలర్ ని బట్టి అర్థం అవుతోంది. అయితే సీక్రెట్ మిషన్ కోసం వెళ్లిన ఎన్ఐఏ ఏజెంట్ అయిన కార్తికేయ.. హోంమంత్రి కూతురుని ప్రేమలో దింపినట్లు తెలుస్తోంది. ఇందులో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటుగా హ్యూమర్ పాళ్ళు కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి. మరి ఏజెంట్ విక్రమ్ సక్సెస్ ఫుల్ గా మిషన్ ని కంప్లీట్ చేశాడా?, లవ్ చేసిన అమ్మాయిని దక్కించుకున్నాడా? అసలు ఈ రాజా విక్రమార్క వెనకున్న అసలు కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ చిత్రంలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. సుధాకర్ కోమాకుల హీరోకు సహోద్యోగిగా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. తనికెళ్ల భరణి - సాయి కుమార్ - పశుపతి - హర్ష వర్ధన్ - సూర్య - జెమినీ సురేష్ - జబర్దస్త్ నరేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. విజువల్స్ - బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కామెడీ అండ్ యాక్షన్ ప్యాక్డ్ 'రాజా విక్రమార్క' ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది.

కార్తికేయ యాక్టింగ్ - లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. అతని పాత్ర తీరుతెన్నులు కాస్త విచిత్రంగా ఉన్నాయి. ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించడానికి యువ హీరో భారీ వర్కవుట్స్ చేసి పర్ఫెక్ట్ బాడీ ని రెడీ చేసినట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ లో కార్తికేయని ఉద్దేశించి తనికెళ్ల భరణి చెప్పే 'వీడిది బలుపు కాదు దూల' అనే డైలాగ్.. 'పన్నెండేళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేశాక.. పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' 'దీపావళి బాగా గ్రాండ్‌ గానే ప్లాన్‌ చేశావ్‌' అని కార్తికేయ చెప్పే డైలాగ్ అలరిస్తున్నాయి.

'రాజా విక్రమార్క' చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. పి.సి.మౌళి సినిమాటోగ్రఫీ అందించగా.. జెశ్విన్ ప్రభు ఎడిటింగ్ వర్క్ చేశారు. 'చావుకబురు చల్లగా' సినిమాతో నిరాశ పరిచిన కార్తికేయ.. ''రాజా విక్రమార్క'' మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Full View
Tags:    

Similar News