'Rx 100' ఫేమ్ కార్తీకేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''రాజా విక్రమార్క''. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ లుక్ - కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'రాజా విక్రమార్క' టీజర్ విడుదల చేయబడింది.
కొత్తగా నియమించబడిన NIA అధికారి అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్ లో అనుకోకుండా ఒక నిందితుడైన నైజీరియన్ ని కాల్చి చంపినట్లు టీజర్ లో చూపించారు. ఇందులో హై ఇంటెన్స్ యాక్షన్ తో పాటుగా హ్యూమర్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. 'మార్కింగ్ కాశ్మీర్ లో మిలిటెంట్లు కి దొరికిపోయి.. సెకండ్ షో చూడానికి ఢిల్లీ కి వచ్చాడు.. వాడిని ఆపడం ఎవరి తరం' అంటూ ఇందులో కార్తికేయ పాత్ర గురించి తెలియజేసారు.
'రాజా విక్రమార్క' టీజర్ చివర్లో ''చిన్నప్పుడు కృష్ణ గారిని, పెద్దయ్యాక టామ్ క్రూజ్ ని చూసి ఆవేశపడి జాబ్ లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు'' అని కార్తికేయ చెప్పే డైలాగ్ అలరిస్తోంది. ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించడానికి భారీ వర్కవుట్స్ చేసి పర్ఫెక్ట్ బాడీ ని రెడీ చేసినట్లు అర్థం అవుతోంది. ఈ టీజర్ కు విజువల్స్ - బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. సుధాకర్ కోమాకుల తోటి NIA అధికారిగా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. తనికెళ్ల భరణి - సాయి కుమార్ - పశుపతి - హర్ష వర్ధన్ ఇతరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పి.సి.మౌళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జెశ్విన్ ప్రభు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'రాజా విక్రమార్క' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Full View