రాజమౌళి గొప్ప దర్శకుడిగా ఎదగడంలో.. ఏ తెలుగు దర్శకుడూ అందుకోని స్థాయికి చేరుకోవడంలో ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పాత్ర కీలకం. ఒకటీ అరా మినహాయిస్తే రాజమౌళి సినిమాలకు ఆయనే కథకుడు. ఆయన గొప్ప కథలు రాశాడు కాబట్టే రాజమౌళి కూడా అంత గొప్పగా వాటిని తీర్చిదిద్దగలిగాడు. రైటింగ్ పార్ట్ వరకు రాజమౌళికి ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకునేది విజయేంద్ర ప్రసాదే. తాను ఓ సినిమాను ముందే విజువలైజ్ చేసుకోవడంలో.. దాన్ని ఎంత బాగా తీయాలా అని తపించేలా చేయడంలో తన తండ్రి తనకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటాడని అన్నాడు రాజమౌళి. కేవలం పాత్రల్ని చెప్పడం ద్వారానే ఆయన తనను కదిలిస్తారని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
‘‘మా నాన్న గారు నాకెప్పుడూ కథలు చెప్పరు. ఇదీ కథ అని నాకెప్పుడూ వివరించరు. ముందు నాకు పాత్రల్ని పరిచయం చేస్తారు. ఒక్కో పాత్ర గురించి చెబుతారు. దాని లక్షణాలేంటి.. ఆ పాత్ర నేపథ్యమేంటి.. ఇలా వివరిస్తారు. ముందు ఆ పాత్రను ఆకళింపు చేసుకునేలా చేస్తారు. అలాగే కొన్ని సంఘటనలు కూడా వివరిస్తారు. ఇక వాటితోనే నా ప్రయాణం సాగుతుంది. ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తుంటా. వాటితో మమేకం అయిపోతా. ఆయన అంత గొప్పగా ఆ పాత్రల గురించి చెప్పినపుడు.. వాటిని అంతే గొప్పగా తెరమీద ప్రెజెంట్ చేయాలని అనుకుంటా. ఈ విషయంలో చాలా ఆత్రుతగా ఉంటుంది. ఇలా నన్ను నాన్నగారు ఎప్పుడూ ఇన్ స్పైర్ చేస్తూ ఉంటారు’’ అని రాజమౌళి తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/