కొంతమంది ప్రముఖుల తీరు చాలా చిత్రంగా ఉంటుంది. వారిచ్చే సలహాలతో కొంతమంది చెలరేగిపోతుంటారు. ఎదుటివారికిచ్చిన సలహాల్ని తమకు తాము పాటించని వైనం కనిపిస్తుంది. అలాంటి చిత్రమైన గుణం ప్రముఖ దర్శకుడు రాజమౌళిలో కూడా కనిపిస్తుందని చెప్పాలి. ఆయన తీస్తున్న బాహుబలి కళాఖండంగా మారి.. సినీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన విషయాన్ని మర్చిపోలేం.
దాదాపు ఏడాదిన్నర క్రితం (2015 - జులై10) బాహుబలి రిలీజ్ అయ్యింది. తెలుగు సినిమా రేంజ్ మొత్తాన్ని మార్చేయటమే కాదు.. టాలీవుడ్ మూవీ గురించి దేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు మాట్లాడుకునేలా చేసిందని చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇవన్నీ సగలు తెలుగువాడిగా అందరికి సంతోషం కలిగించే విషయమే.
కానీ.. బాహుబలి మొదటిభాగం విడుదలయ్యే సమయానికే రెండో భాగానికి సంబంధించిన వర్క్ కాస్త పూర్తి అయ్యిందని చెప్పిన జక్కన్న.. సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకే కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడని చెప్పాలి. మొదటి భాగాన్ని చూసిన వారంతా.. రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అని కళ్లకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పరిస్థితి.
ఎట్టకేలకు బాహుబలి విడుదలైన నెలల తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి.. మొన్నీమధ్యనే గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే సెకండ్ పార్ట్ రిలీజ్ కు డేట్ ఇచ్చేసిన నేపథ్యంలో.. పనులన్నింటిని అప్పటికే పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలయ్యకు మైల్ స్టోన్ లాంటి శాతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రాన్ని కేవలం 79రోజుల్లోనే పూర్తి చేశారు క్రిష్. ఈ సినిమా ట్రైలర్ ను చూసినప్పుడు.. భారీతనం ఎక్కడా తగ్గని రీతిలో ఉంది. తక్కువ వ్యవధిలో శాతకర్ణిని క్రిష్ తీయగా లేనిది జక్కన ఎందుకు బాహుబలిని మరీ అంత ఇదిగా చెక్కేస్తున్నారన్న వాదన ఒకటి మొదలైంది. ఈ చర్చ ఇలా సాగుతున్న వేళ.. శాతకర్ణి విడుదల సందర్భంగా క్రిష్ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా జక్కన్న ప్రస్తావన వచ్చింది. ఆయన్ను కలిసిన సందర్భంగా తనకు ఆయన రెండు సలహాలు ఇచ్చారని.. అందులో ఒకటి గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా.. లైవ్ లోనే షూటింగ్ మొత్తం అయ్యేలా చూసుకొమ్మని.. రెండోది.. ట్రైలర్ చూశాక.. ఇక నుంచి విడుదల వరకు ఒక్క క్షణం కూడా నిద్రపోకు.. ఈ సినిమాలో ఏదో కనిపిస్తోంది నాకు అని భుజం తట్టారని చెప్పుకొచ్చారు.
గ్రాఫిక్స్ జోలికి వెళితే ఎన్ని కష్టాలు ఉంటాయన్న విషయం బాహుబలి మొదటి భాగంలోనే జక్కన్నకు తెలిసిన విషయమే. ఆ అనుభవంతోనే గ్రాఫిక్స్ జోలికి వెళ్లొద్దని క్రిష్ కు రాజమౌళి చెప్పారనుకోవాలి. మరి..ఎదుటివారికి సలహా ఇచ్చిన జక్కన్న.. తన సినిమా వరకూ వచ్చేసరికి ఆ సలహానే ఆయన ఎందుకు పాటించలేదంటారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/