కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా కరోనా అలజడి సృష్టించింది. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని.. వైద్యుల సూచనలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నామని రాజమౌళి ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.
కాగా రాజమౌళి ట్వీట్ చేస్తూ.. ''కొద్ది రోజుల క్రితం నాకు నా కుటుంబ సభ్యులకు జ్వరం వచ్చింది. అది తగ్గిపోయినప్పటికీ మేము కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాము. అయితే ఈ రోజు వచ్చిన టెస్టు ఫలితాల్లో కొద్దిగా కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. వైద్యుల సూచనలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాం. కరోనా బారిన పడినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవు. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తాం. యాంటీ బాడీస్ వృద్ధి చెందే సమయం కోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడే మేము ప్లాస్మాను దానం చేయొచ్చు'' అని వెల్లడించారు. రాజమౌళి కుటుంబం కరోనా నుంచి క్షేమంగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన కుటుంబానికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐశ్వర్యా రాయ్ మరియు ఆధ్య కరోనా నుండి బయటపడ్డారు. హీరో విశాల్ కి ఆయన తండ్రి జీకే రెడ్డికి కరోనా సోకినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకోని కేవలం వారం రోజుల్లోనే బయటపడ్డామని.. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని విశాల్ ప్రకటించారు. టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ సైతం కరోనాని జయించాడు.