ప్రభాస్ అభిమానులంతా కూడా 'రాధే శ్యామ్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఇద్దరి సంభాషణలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రభాస్ మాట్లాడుతూ .. 'బాహుబలి' తరువాత యాక్షన్ తో కూడిన లవ్ సినిమా చేయాలని అనుకున్నాను. కానీ రాధాకృష్ణ కుమార్ పూర్తి లవ్ స్టోరీ చేశాడు. 'బాహుబలి' తరువాత నాతో లవ్ స్టోరీ చేయాలనుకోవడం అంత ఈజీ కాదు. అయినా చేసినందుకు ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను.
లవ్ స్టోరీస్ ప్రస్తావన వచ్చింది కనుక నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. నేను చేసిన 'వర్షం' సినిమాను మీరు చూశారు. "అసలు ఒక అబ్బాయి అమ్మాయి వెనుక అదే పనిగా పడటం నేను రాయలేను .. తీయలేను .. చూడలేను డాళింగ్" అన్నారు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ల గురించి నేను ఆలోచించను అని కూడా అన్నారు. కట్ చేస్తే 500 ఏళ్ల తరువాత కూడా ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడినట్టుగా 'మగధీర' తీశారు. 'వర్షం'లో అమ్మాయి వెంట అబ్బాయి పడటం కొంతసేపు ఉంటుంది. మీరు 500 సంవత్సరాల తరువాత కూడా అమ్మాయి వెంటపడటం చూపించారు.
నాలుగేళ్లలోనే అంత మార్పు మీలో ఎలా వచ్చింది? అని ప్రభాస్ అడిగాడు. 'నువ్వే చెడగొట్టావ్ నన్ను' అని రాజమౌళి కూల్ గా చెప్పడంతో ప్రభాస్ ఒక్కసారిగా నవ్వేశాడు. ముందు నేను పెద్దగా పట్టించుకోలేదుగానీ ఆ తరువాత గుర్తుకు వచ్చింది" అన్నాడు. రాజమౌళి మాట్లాడుతూ 'సంచారి' సాంగ్ నాకు బాగా నచ్చింది. ఆ పాటలో ఒక చోట నీ నవ్వు నచ్చింది' అని చెప్పారు. అందుకు ప్రభాస్ నవ్వుతూ 'మీకు నచ్చిందంటే అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది" అని అన్నాడు.
ఆ తరువాత ఆయన మాట్లాడుతూ .. "రాధేశ్యామ్' సినిమాకీ .. 'ఆర్ ఆర్ ఆర్' మధ్య ఏదో సంబంధం ఉంది. అందువల్లనే మీరు మీ సినిమా రిలీజ్ కి ఉండగా, నా సినిమా ప్రమోషన్స్ కి వచ్చి మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. 'రాధేశ్యామ్' షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతుండగా. ఆ పక్కనే మీ 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ జరుగుతూ ఉండేది. మీరు అక్కడ యాక్షన్ అని చెప్పడం .. ఇక్కడ నాకు రాధాకృష్ణ యాక్షన్ అని చెప్పడం గమ్మత్తుగా ఉండేది. మా సినిమా సెట్లో అలియా భట్ కి సంబంధించిన సీన్ కూడా ఒకటి చేశారు" అని చెప్పుకొచ్చాడు.