యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సుకుమార్ రూపొందించిన నాన్నకు ప్రేమతో ట్రైలర్ రిలీజ్ సెన్సేషన్స్ సృష్టిస్తోంది. ఎన్టీఆర్ స్టైలిష్ అవతార్ కి ఫ్యాన్స్ నుంచి ఆడియన్స్ వరకూ.. ఇండస్ట్రీ నుంచి దిగ్గజ దర్శకుల వరకూ ప్రశంసలు వస్తున్నాయి. ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ ట్రైలర్ రిలీజ్ అయితే. టాప్ డైరెక్టర్లు కూడా స్పందిచడం కామనే కానీ.. వారు ఏకంగా రివ్యూలు కూడా రాసేయడం విశేషం.
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. నాన్నకు ప్రేమతో ట్రైలర్ చూసిన తర్వాత.. తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. "స్టైలిష్ అండ్ కూల్. గతంలో మేము చూపించిన విధానానికి విభిన్నంగా.. ఎన్టీఆర్ ని సుకుమార్ ఆవిష్కరించాడు. నాన్నకు ప్రేమతో చాలా మంచి చిత్రంగా నిలుస్తుందని అనిపిస్తోంది. ప్రసాద్ గారు - సుక్కు - బాపి.. ఇలా మొత్తం టీంకి అల్ ది బెస్ట్. తారక్ నటించిన 25వ సినిమా కలకాలం గుర్తుండిపోయే చిత్రం అవ్వాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశాడు జక్కన్న.
ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. "ఎన్టీఆర్ కనుక స్వర్గం నుంచి ఈ సినిమాను చూస్తే.. అక్కడి నుంచి వచ్చి మనవడిని కౌగిలించుకుంటాడు. ఆయన గర్వపడే సినిమా అవుతుంది నాన్నకు ప్రేమతో. ఆ అడవి రాముడికి నువ్వు అసలైన వారసుడివి తారక్." అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఇలా టాప్ డైరెక్టర్లను ఆకట్టుకున్న ఈ చిత్రం.. టాప్ హిట్ అవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.