ట్రిపుల్ ఆర్ ట్రైన్ ఎపిసోడ్ వెన‌క ఇంతుందా?

Update: 2022-05-31 16:02 GMT
`బాహుబ‌లి`తో తెలుగు సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపుని తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఎవ‌రు అవున్నా కాద‌న్నా ఇది ప్ర‌తీ ఒక్క‌రూ ఏక‌గ్రీవంగా అంగీక‌రించాల్సిన విష‌యం. త‌న వ‌ల్లే తెలుగు సినిమా అంటే యావ‌త్ దేశం మొత్తం అటెన్ష‌న్ తో త‌లెత్తి చూస్తోంది. ఆ స్థాయిలో తెలుగు సినిమాకు కీర్తి ప్ర‌తిష్ట‌ల్ని తెచ్చిపెట్టిన రాజ‌మౌళి తాజాగా మ‌రో అద్భుతాన్ని తెర‌పై `ట్రిపుల్ ఆర్` రూపంలో ఆవిష్క‌రించారు. ఇద్ద‌రు క్రేజీ స్టార్ లు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌తో క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది.

విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీలోని ప్ర‌తీ స‌న్నివేశం ప్రేక్ష‌కుల చేత అద్భుతం అనిపించింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా 1100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుని సృష్టించింది. అయితే వెండితెర‌పై ఇద్దురు స్టార్ హీరోల‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి క్రియేట్ చేసిన స‌న్నివేశాలు, ఇద్ద‌రు హీరోల‌పై చిత్రీక‌రించిన ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్.. సినిమాలోని కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేసిన తీరుపై ఇప్ప‌టికే చాలా మంది చాలా ర‌కాలుగా చ‌ర్చించారు. త‌మ అభిప్రాయాల‌ని వెల్ల‌డించారు.

చాలా వ‌ర‌కు సినిమాలోని కీల‌క ఘ‌ట్టాలని కేవ‌లం గ్రాఫిక్స్ గానే తేల్చేశారు. అయితే వాటి వెన‌క రాజ‌మౌళి ప‌డిన క‌ష్టం, రాజ‌మౌళి విజ‌న్ ని తెర‌పై ఆవిష్క‌రించ‌డంతో హీరోలు చేసిన రిస్క్‌, సాంకేతిక నిపుణులు ప‌డిన శ్రమ‌ని మాత్రం ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోయారు. సినిమాలో రామరాజు, భీమ్ ల మ‌ధ్య షూట్ చేసిన ప‌రిచయ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ట్రైన్ సీన్ ఎపిసోడ్ వీడియోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ మేకింగ్ వీడియోని చూస్తే రాజమౌళి అభినందించ‌కుండా వుండ‌లేం.

సినిమాలోని రామ్ - భీమ్‌ల ప‌రిచ‌యం నేప‌థ్యంలో వ‌చ్చే తొలి సీన్ లో ట్రైన్ సీక్వెన్స్ .. ఆ త‌రువాత ఇద్ద‌రు ఓ పిల్లాడిని కాపాడ‌టానికి సాహ‌సోపేతంగా ప్ర‌య‌త్నించ‌డం.. ఈ  ఈ స‌న్నివేశాల కోసం హీరోలు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, రాజ‌మౌళి, టెక్నిక‌ల్ టీమ్ ఎంత‌గా శ్ర‌మించారో తాజాగా విడుద‌ల చేసిన మేకింగ్ వీడియోలో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ముందు ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ ల స‌న్నివేశాల‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో రైలు వంతెన‌కు సంబంధించిన రెండు స్థంభాల‌ని మాత్ర‌మే ఏర్పాటు చేసి మిగ‌తా భాగాన్ని గ్రాఫిక్స్ తో క్రియేట్ చేశారు. ఇక ట్రైన్ ని, దానికి సంబంధించిన బోగీల‌ని అమెరికాలో త‌యారు చేయించారు. వాటిని రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చారు.

ఆ త‌రువాత రాజ‌మండ్రి బ్రిడ్జిని న‌మూనాగా తీసుకుని డెన్మార్క్ కు చెందిన గ్రాఫిక్స్ బృందం సాయంతో బ్రిడ్జిని క్రియేట్ చేశారు. దాని చుట్టూ వున్న వాతావ‌ర‌ణాన్ని రీ క్రియేట్ చేసి నిజ‌మైన ప్రాంతాన్నే చూస్తున్న ఫీల్ ని క‌లిగించారు. ఆ త‌రువాత రెండు సీన్ ల‌ని జ‌త చేసి వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌కు రోమాంచిత‌మైన అనుభూతిని క‌లిగించే అద్భుతాన్ని ఆవిష్క‌రించారు. ఈ సీన్ ల‌ని డెన్మార్క్ కోపెన్ హ‌గెన్ లోని విజువ‌ల్ ఎఫెక్ట్స్ స్టూడియోలో రూపొందించారు. ఈ స‌న్నివేశాల‌ని మ‌రింత ఫైర్ ని యాడ్ చేసి అత్యంత స‌హ‌జంగా క‌నిపించేలా ప్లాన్ చేశారు. సినిమాలోని ఈ స‌న్నివేశం థియేట‌ర్లో చూస్తున్న ప్ర‌తీ ఒక్క‌రికీ రోమాంచిత అనుభూతిని క‌లిగించింది.  

తాజాగా విడుద‌ల చేసిన మేకింగ్ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. తెరవెనుక  హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్, ద‌ర్శ‌కుడు ప‌డిన శ్ర‌మ‌, ద‌ర్శ‌కుడి విజ‌న్ ని వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డం కోసం టెక్నీషియ‌న్స్ ప‌డిన త‌ప‌న ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇలాంటి అద్భుత దృశ్యాల‌ని తెర‌పై అంతే ప‌వ‌ర్ ఫుల్ గా ఆవిష్క‌రించ‌డానికి రాజ‌మౌళి ఎందుకు ఏళ్ల‌కు ఏళ్లు తీసుకుంటారో, ఆయ‌నకు సినిమాపై వున్న క‌మాండిగ్ ఏ స్థాయిలో వుంతో ఈ మేకింగ్ వీడియోతో మ‌రోసారి స్ప‌ష్టం కావ‌డం విశేషం.



Full View
Tags:    

Similar News