హీరో విలనిజం.. అలా సెట్ చేశారు..!
ఆ సినిమాలో ప్రభాస్, రానా ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందుకే సినిమాను సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.
ఒకప్పుడు హీరో అంటే కేవలం హీరో పాత్ర మాత్రమే చేసే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోలే విలన్లుగా మారి ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నారు. హీరో, విలన్ చేసే పాత్ర ఏదైనా ప్రేక్షకులను అలరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. స్టార్ హీరోల్లో కొందరు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి విలన్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే టాలీవుడ్ లో రానా ముందుంటాడు. బాహుబలి ఎంత బలవంతుడు అన్నది తెలియాలంటే అతని ప్రతినాయకుడు భళ్లాలదేవా ఎంత బలవంతుడో తెలుసుకోవాలి. ఆ సినిమాలో ప్రభాస్, రానా ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందుకే సినిమాను సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.
ఇక తమిళ పరిశ్రమలో ఓ పక్క విజయ్ సేతుపతి హిరోగా లీడ్ సినిమాలు చేస్తూనే విలన్ గా మెప్పిస్తున్నాడు. తెలుగులో ఉప్పెనలో శేషారాయణం రోల్ చేసిన విజయ్ సేతుపతి ఆ సినిమాలో ఆ పాత్రలో ఆయన తప్ప వేరే ఎవరు అంత బాగా చేయలేరని అనిపించేలా చేశారు. ఇక తమిళ్ లో మాస్టర్, విక్రం ఇలా ప్రతి సినిమాలో విలన్ గా ఆడియన్స్ ను అలరిస్తున్నారు. కోలీవుడ్ లో సూర్య కూడా రోలెక్స్ పాత్రలో తనలోని నెగిటివ్ షేడ్ తో అదరగొట్టాడు. రోలెక్స్ ఫుల్ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్ ఎలాంటి సినిమాలో అయినా నటించే సత్తా ఉన్న నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఫహద్ సినిమాలో ఉన్నాడు అంటే ఒక వెరైటీ రోల్ లో మెప్పిస్తాడని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. పుష్ప సినిమాలో ఫహద్ చేసిన పాత్ర హైలెట్ గా మారింది. పుష్ప 2 లో ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన కిచ్చ సుదీప్ అక్కడ ఆయన స్టార్ హీరో అయినా తెలుగులో ఈగ సినిమాలో విలన్ గా మెప్పించారు. తానొక స్టార్ అయ్యుండి విలన్ గా ఆయన నటించిన తీరు ఇంప్రెస్ చేసింది. ఇప్పటికీ తెలుగులో నెగిటివ్ రోల్ వస్తే చేసేందుకు సిద్ధమని అంటున్నాడు కిచ్చ సుదీప్.
స్టార్ హీరోలే కాదు యువ హీరోలు కూడా విలన్ గా మెప్పించేందుకు రెడీ అంటున్నారు. ఈమధ్య సినిమాల్లో విలన్ పాత్రలు కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటున్నాయి కాబట్టి విలన్ గా కూడా నటించి వావ్ అనిపించేస్తున్నారు.