ర‌ష్మిక‌లో ఆ క్వాలిటీ 19 ఏళ్ల‌కేనా?

ర‌ష్మిక ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతుంటాయి.

Update: 2024-10-03 02:45 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా నేడు పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం. `పుష్ప‌`, `యానిమ‌ల్` విజ‌యాలు అమెని అగ్ర స్థానంలో కూర్చ‌బెట్టాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ టాప్ స్టార్ల‌తోనే సినిమాలు చేస్తోంది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే బాలీవుడ్ బిగ్ స్టార్స్ తో తెలివిగా సినిమాలు చేస్తోంది. ఇదంతా ప‌క్క‌న బెబితే నెట్టింట ఆమెకి ఫాలోయింగ్ పీక్స్ లో ఉంది. ర‌ష్మిక ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతుంటాయి.

ఇదంతా ఇప్పుడు. ఒక‌ప్పుడు ర‌ష్మిక అంటే కేవ‌లం క‌న్న‌డ వ‌ర‌కే ప‌రిమితం. అక్క‌డ పెద్ద‌గా స‌క్సెస్ అయింది లేదు. అమ్మ‌డి తొలి సినిమా అంటే `కిరిక్ పార్టీ` గుర్తొస్తుంది. ర‌క్షిత్ శెట్టి ఆమెని ప‌రిచ‌యం చేయ‌డంతోనే ప‌రిశ్ర‌మ‌కి రాగ‌లిగింది. అయితే ఆమె తొలి సినిమా వేరే ఉంద‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. అమ్మడు మొదటి సినిమా పేరు `గోపిలోల`. అయితే ఈ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మ‌వ్వ‌డంతో డెబ్యూ కిరిక్ పార్టీ అయింది.

ప్రస్తుతం రష్మిక తన తొలి సినిమా ఆడిషన్ వీడియో ఒక‌టి నెట్టింట తెగ వైరలవుతుంది. అది చూసి నెటి జ‌నులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అందులో ఆమె యాక్టింగ్, మాటలు, అల్లరి నవ్వులు తెప్పిస్తున్నాయి. అలాగే డ్యాన్స్ కూడా బాగా చేసింది. డైలాగ్ చెప్పాలని డైరెక్టర్ కోరగా ఫన్నీగా డైలాగులు చెప్పేసింది. అప్పుడు త‌న‌ వయసు 19 ఏళ్లు. కాలేజీ చ‌దువుతుంది. హైట్ 5.5 ఉంటుందని చెప్పుకొ చ్చింది.

తన పర్సనల్ వివరాలు చెప్పి డాన్స్ కూడా అదరగొట్టేసింది. ర‌ష్మికలో అల్ల‌రి ల‌క్ష‌ణాలు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాకే నేర్చుకుంద‌నుకున్నారంతా. కానీ త‌న‌లో ఆ ల‌క్ష‌ణం బై బ‌ర్త్ ఉంద‌ని తెలుస్తోంది. ఇక గోపిలోల సినిమా అక్టోబర్ 4న విడుదలవుతుంది. అయితే సినిమాలో ఆమె హీరోయిన్ కాదు. ఇందులో రష్మిక నటించా ల్సిన పాత్రలో మిన్ కె చంద్రను ఎంపిక చేశారు.

Tags:    

Similar News