సోనమ్ గోల్డ్ స్కర్ట్ సూట్ స్టన్నింగ్
అయినా సోషల్ మీడియాల్లో నిరంతరం తనదైన ఫ్యాషన్ సెన్స్ తో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.
సోనమ్ కపూర్ పరిచయం అవసరం లేదు. ధనుష్ సరసన `రాంజానా` లాంటి జాతీయ అవార్డ్ చిత్రంలో నటించిన సోనమ్ పలు సినిమాల్లో అవార్డ్ విన్నింగ్ ప్రదర్శనలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇటీవల సోనమ్ సినిమాలను తగ్గించి తన బిజినెస్‌మేన్ హబ్బీతో కలిసి విదేశాల్లో నివసిస్తోంది. అయినా సోషల్ మీడియాల్లో నిరంతరం తనదైన ఫ్యాషన్ సెన్స్ తో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.
తాజాగా సోనమ్ గోల్డ్ కలర్ స్కర్ట్ సూట్‌లో మెరిసిపోయింది. ఈవెంట్లో మెరిసే కోచర్ స్కర్ట్ సూట్‌లో కనిపించగా.. ఇది తమరా రాల్ఫ్ 2024 కలెక్షన్ నుండి ఎంపిక చేసుకున్న డిజైనర్ లుక్. దీనికి గొలుసు అలంకరణ.. మోకాళ్ల వరకు ఉన్న దుస్తులకు గోల్డ్ షేడ్స్‌లో ఉన్నాయి. తన అలంకరణకు తగ్గట్టుగా బంగారు నగలతోను అలంకరించుకుంది. చంకీ చైన్ స్టేట్‌మెంట్ గోల్డ్ నెక్లెస్ పెద్ద స్టడ్ చెవిపోగులతో సోనమ్ ఒద్దికగా కనిపించింది.
ఈ లుక్ ని డిజైన్ చేసినది ఇంతకీ ఎవరు? అంటే.. మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత, సోనమ్ సోదరి రియా కపూర్ ఈ లుక్ ని డిజైన్ చేసింది. ప్రస్తుతం ఇది అంతర్జాలంలో వైరల్ గా మారింది. సోనమ్ లుక్ కి రియాక్షన్స్ ఒక రేంజులో ఉన్నాయి. ఈ లుక్ అద్భుతంగా ఉందంటూ నటి భూమి పెడ్నేకర్ వ్యాఖ్యానించారు. సోనమ్ భర్త, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా `వైల్డ్` అని రాశారు. సోనమ్ లుక్‌పైనా, రియా పోస్ట్‌పైనా ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. ఫ్యాషన్ ఐకాన్.. ఫ్యాషన్ క్వీన్ అని కొందరు వ్యాఖ్యానించారు. స్కర్ట్ సూట్ లాయలిస్ట్‌లుగా మారుతున్న అనేక మంది ప్రముఖుల్లో సోనమ్ ఒకరు .. బ్లేజర్ + స్కర్ట్స్ కాంబినేషన్ తో సోనమ్ ప్రత్యేకతను ఆపాదిస్తోందని పలువురు ప్రశంసించారు.