రెండో బాహుబలి ట్రైలర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. వరల్డ్‌లోనే టాప్ వ్యూస్ సొంతం చేసుకొన్న కొన్ని ట్రైలర్లలో ఇదొకటిగా నిలిచింది. ఇండియాలో అయితే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకొంది. ఇప్పటిదాకా భారతీయ సినిమాలకి సంబంధించిన ఏ ట్రైలర్ నీ చూడని విధంగా దీన్ని చూశారు ప్రేక్షకులు. ఆ రెస్పాన్స్ చూసి బాహుబలి టీమ్ సైతం ఆశ్చర్యపోతోంది. అయితే కేవలం 140 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ కోసం రాజమౌళి టీమ్ రెండు నెలలపాటు కష్టపడిందట. అంటే ఒక సినిమాని తీసేంతటి సమయాన్ని ట్రైలర్ కోసమే వెచ్చించారన్నమాట.
రాజమౌళి తనయుడు కార్తికేయ ట్రైలర్ టీమ్ కి నేతృత్వం వహించినట్టు తెలిసింది. వంశీ అనే ఓ యువ ఎడిటర్ ఆ ట్రైలర్ ని కట్ చేశాడట. మొత్తం 25 వెర్షన్లు కట్ చేయించి, దాంట్లో ది బెస్ట్ అనిపించిన ఫైనల్ వెర్షన్ ని ఓకే చేశాడట రాజమౌళి. దీన్నిబట్టి ట్రైలర్ కోసం ఏ రేంజ్‌లో కసరత్తులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్తాప్యంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాళ్లందరినీ ట్రైలర్ తోనే అబ్బురపరచాల్సిన ఓ ఛాలెంజ్ రాజమౌళిపై ఉంది. అందుకే ఒక బృందాన్ని ట్రయిలర్ కోసమే కేటాయించి ఆ పని విజయవంతంగా పూర్తి చేయించాడు. మామూలుగా అయితే సినిమా కోసం స్టోరీ బోర్డ్ వేసుకొంటుంటారు. కానీ రాజమౌళి టీమ్ మాత్రం ట్రైలర్ కోసం కూడా స్టోరీ బోర్డ్ వేసుకొన్నారట. ఆ మేరకే ట్రైలర్‌ని కట్ చేశారట. మొత్తంగా రాజమౌళి అండ్ టీమ్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలమే వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/