జక్కన్న చెక్కేచోటు మార్చేశాడు

Update: 2018-06-08 04:22 GMT
రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే కోసం ఇద్దరు హీరో అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న కూడా ఈ సినిమాకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశాడు. బాహుబలి కోసం ఓ మహాసామ్రాజ్యాన్నే సెట్ వేయించిన రాజమౌళి మల్టీస్టారర్ మూవీ కోసం కూడా ఓ భారీ సెట్ ప్లాన్ చేస్తున్నాడు.

బాహుబలి సెట్ అంతా రామోజీ ఫిలిం సిటీలోనే వేశారు. రాజమౌళి ఆయన టీం అంతా దాదాపు నాలుగేళ్లపాటు అదే సెట్లో పని చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం సెట్ ఫిలిం సిటీలో వేయడం లేదు. ఇంతకుముందు చాలా సినిమాల్లో కనిపించిన గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ కాంపౌండ్ లోని విశాలమైన ఖాళీ స్థలంలో వేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలు భారీ మొత్తం ముట్టజెప్పి ఫ్యాక్టరీ ఆవరణను రెండేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ సెట్ రూపకల్పన పని మొదలెట్టేశాడు.  

బాహుబలి సినిమా బిజినెస్ విషయంలో రాజమౌళికి -  రామోజీరావుకు బెడిసికొట్టిందని.. దాంతో రామోజీరావు బాహుబలి సెట్లకు రూ. 90 కోట్లకు పైగా బిల్ పంపారనే న్యూస్ టాలీవుడ్ లో షికారు చేస్తోంది. అఫ్ కోర్స్ దీనిని నిర్మాత శోభు యార్లగడ్డ కాదని అనేశాడు. ఇంతలోనే రాజమౌళి అలవాటయిన ప్లేస్ కాదని.. కొత్త ప్లేస్ లో కోట్లతో సెట్ వేస్తున్నాడంటే ఏదో తేడా కొట్టినట్టే ఉంది.




Tags:    

Similar News