యూఎస్ ట్రిప్ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

Update: 2019-07-04 07:55 GMT
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నారు.  అయితే రాజమౌళి ట్రిప్ తానా సభల్లో పాల్గొనడం కోసమేనని ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి.  ఇప్పటికే తానా సభలకు సంబంధించిన సందడి మొదలైన సంగతి తెలిసిందే.  జులై 4 నుండి జులై 6 వరకూ తానా సభలు జరగనున్నాయి.  దీంతో రాజమౌళి తన ట్రిప్ గురించి క్లారిటీ ఇచ్చారు.

రాజమౌళి ట్విట్టర్ ద్వారా "ఫ్రెండ్స్.. నేను వ్యక్తిగత పనుల నిమిత్తం వాషింగ్టన్ వచ్చాను.  TANA కన్వెన్షన్ కోసం కాదు.  పెద్దన్న(కీరవాణి) మ్యూజికల్ షోకు కూడా హాజరయ్యే అవకాశం లేదు.  నేను అక్కడికి వస్తానని ఆశించిన వారు నేను రాకపోతే నిరాశపడే అవకాశం ఉంది.  అందుకే నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.  దీంతో తానా సభలకు హాజరయ్యే సెలబ్రిటీల లిస్టుల్లో జక్కన్న ఉండరని తేలిపోయింది.

అంతా బాగానే ఉంది కానీ జక్కన్న ఇప్పుడు అమెరికాకు ఏ పని మీద వెళ్ళాడనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఆయన ప్రస్తుతం #RRR పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  రామ్ చరణ్.. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  


Tags:    

Similar News