టాలీవుడ్ జక్కన్న రాజమౌళి 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ఆకాశంలో నిలిపాడు. బాలీవుడ్ సినిమాలకు కూడా దక్కని అరుదైన.. అద్బుతమైన రికార్డులను బాహుబలి సినిమాలకు దక్కాయి. అంతటి గొప్ప సినిమా తీసిన తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది జులై 30 విడుదల చేయబోతున్నట్లుగా రాజమౌళి ఎప్పుడో ప్రకటించాడు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమే అనిపిస్తుంది. రామ్ చరణ్ 'సైరా' సినిమా ప్రమోషన్ కోసం అంటూ దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉన్నాడని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు గాయాల కారణంగా కొన్ని రోజులు షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యిందనే విషయం తెల్సిందే. ఇప్పుడు రాజమౌళి తన బాహుబలి టీం తో కలిసి లండన్ కు వెళ్లాడు. అక్కడ ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి ప్రదర్శించారు.
అక్టోబర్ మొదటి వారం నుండి ఆలియా భట్ 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం కోసం డేట్లు కేటాయించింది. కాని ఆ డేట్లను జక్కన్న వినియోగించుకోలేక పోయాడట. దాంతో మళ్లీ ఆలియా డేట్లు కావాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అయిదు సినిమాల్లో ఆలియా హీరోయిన్ గా నటిస్తోంది.
ఆ కారణంగా ఆలియా మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంకు డేట్లు కేటాయించాలంటే సమయం పడుతుందని.. దాంతో మొత్తం షెడ్యూల్స్ అన్నీ గందరగోళం అవుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. షెడ్యూల్స్ గందరగోళం అవ్వడంతో సినిమా విడుదల తేదీ విషయంలో కూడా అనుమానాలు వస్తున్నాయి. జులై 30 కి అన్న సినిమా దసరాకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.