అదే కథను వేరేలా తీసిన రాజమౌళి

Update: 2017-05-04 09:39 GMT
తెలుగులో కథలు లేవు అని మనం వింటున్నాం. ఐతే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది కథలు ఎప్పుడు ఒకటే వాటిలో పాత్రలు బట్టి కథ చిన్నదిగా, గొప్పగా, లోతైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే బాధకి అందరూ ఒకలా స్పందించారు. ఒకడు ఒకలా వేరొకడు మరోలా దాన్ని అర్ధంచేసుకొంటాడు అక్కడే కథ మలుపు తిరుగుతుంది.. కొత్తగా కనిపిస్తుంది. రాముడు యుద్దం చేసినా.. కృష్ణుడు యుద్దం చేయించినా.. అది న్యాయం కోసమే. కాని ఈ పాత్రల తీరే వేరు.

చూస్తుంటే ఇప్పుడు రాజమౌళి కూడా అదే చేశాడమో అనిపిస్తోంది. ''ఒక తల్లికి ఇద్దరు కొడుకులు. ఒకడు కన్నబిడ్డ మరొకడు పెంచిన బిడ్డ. తల్లి పెంచిన కొడుకు పై  ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. అందుకే కన్నకొడుకు వరసకు తమ్ముడు అయిన  వాడితో గొడవపడి తల్లి నుండి దూరం చేస్తాడు. చివరకు ఆ తల్లి కొడుకు ఏమవుతారు.. దుష్టుడు అయిన కన్నకొడుకు ఏమవుతాడు.. మద్యలో వచ్చిన విలన్ల ఏమవుతారు అనేదే కథ'' . ఇది ఛత్రపతి సినిమా కథ. ఆగండి ఆగండి.. తీక్షణంగా చూస్తే ''బాహుబలి'' కథ కూడా అదే. ఛత్రపతి కథను ఒక రాజకుటంబం లో పెట్టి చూస్తే.. మహిష్మతి రాజ్యం లో జరిగిన యుద్దం కూడా.. కన్నకొడుకు పెంచిన కొడుకు మధ్యనే ఉంటుంది. అదే తల్లి. అదే ప్రేమలు. ఒక లవ్ స్టోరి.

అంటే కథలు ఎప్పుడు మనకు తెలిసినవే ఉంటాయి. ఒక సారి ఒకలా అర్దమైన కథ మరో సారి మరో కోణంలో చేస్తే వేరే కథలా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి కూడా చేసింది అదే. అందరికీ తెలిసిన కథే అయినా మళ్ళీ మళ్ళీ చూసేలా తీశాడు చూడండి.. అది టాలెంట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News