టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్లకు పైగా రాబట్టిన రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో అని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. రాజమౌళి సినిమాలు వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్నాయి.. కాని సంవత్సరాలకు సంవత్సరాల సమయం తీసుకుంటున్నాడు అనే విమర్శలు ఉన్నాయి.
ఏడాది లోపు సినిమాలు తీసి వందల కోట్ల వసూళ్లు దక్కించుకుంటున్న దర్శకులు ఉన్నారు. కనుక రాజమౌళి గొప్పతనం ఏముందంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తన తదుపరి సినిమాల విషయంలో స్పీడప్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాను పట్టాలెక్కించేందుకు రాజమౌళి ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమాను మొదలు పెట్టడానికి కూడా ఏడాదికి పైగా సమయం తీసుకుంటాడు అంటూ అంతా భావించారు. కాని అనూహ్యంగా మహేష్ బాబుతో కలిసి రాజమౌళి దుబాయి వెళ్లాడు. అక్కడ స్క్రిప్ట్ ను మహేష్ బాబుకు నరేట్ చేయబోతున్నాడట. ఇద్దరు కలిసి దుబాయి కి వెళ్లడం పట్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
హీరోగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను ఇటీవలే పూర్తి చేశాడు. వచ్చే నెలలో సర్కారు వారి పాట సినిమా విడుదల కాబోతుంది. ఆ వెంటనే అంటే జూన్ నెలలో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కబోతుంది. త్రివిక్రమ్ సినిమా ను మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడట. అందుకోసం స్క్రిప్ట్ వర్క్ జరిగిందని తెలుస్తోంది.
మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబో సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం జక్కన్న సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంకు మహేష్ బాబు.. రాజమౌళి కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజమౌళి ఇంత స్పీడ్ గా ఉండటం మహేష్ బాబు అభిమానులకు ఆనందం కలిగిస్తుంది.
రాజమౌళి గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాను కేవలం ఏడాది కాలంలోనే పూర్తి చేస్తానంటున్నాడు. 2023 లో మొదలు పెట్టి అదే ఏడాదిలో పూర్తి చేసి సినిమాను 2024 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడట. మొత్తానికి రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబో సినిమా ఇంకా పట్టాలెక్క ముందే సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు నెలల్లో విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.