రచయితలు దర్శకులైన సందర్భాలు సినీ ఇండస్ట్రీలో బోలెడున్నాయి. ఇక కొంతమంది నటులు కూడా అయ్యారు. దిగ్గజ రచయితలు పరుచూరి బ్రదర్స్ పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కు కూడా ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చిందంట.. అదేంటంటే ప్రధాని మోడీ పాత్రలో నటించాలని ఫస్ట్ టైమ్ ఈ ఆసక్తికర ఆఫర్ విజయేంద్రప్రసాద్ తలుపు తట్టినట్టు చెబుతున్నారు.
ఓటీటీలు వచ్చాక సినిమా నటులకు భారీగా అవకాశాలు పెరిగాయి. నాటకీయంగా నటిస్తే చాలు.. ఓటీటీలు భారీ ఆఫర్లతో నటులను ఎంపిక చేసుకుంటున్నాయి. వారి తలరాతలను మార్చేస్తున్నాయి. ఆ పాత్రను బాగా మోయగలిగినంత వరకు ఎవరైనా నటుడిగా మారవచ్చు. బాహుబలి రచయిత, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి వివి విజయేంద్ర ప్రసాద్ కూడా అలాంటి ఆఫర్ ను ఇప్పుడు అందుకున్నట్టు సమాచారం.
ఇటీవలి కాలంలో కరోనా మొదలయ్యాక ప్రధాని మోడీ భారీ గడ్డం పెంచుతున్నాడు. రుషిలా మారిపోయాడు. విజయేంద్ర ప్రసాద్ కూడా ఇలానే మోడీలా గడ్డంను భారీగా పెంచేశఆడు. ఇద్దరూ ఒకే తరహాలో కనిపిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ పిఎం నరేంద్ర మోడీ లాగా కనిపిస్తున్నారని చాలా మంది చెబుతున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్.. ఇతర లుక్స్ చాలా విభిన్నంగా ఉన్నప్పటికీ, నరేంద్ర మోదీపై షార్ట్ మూవీ తీయాలనుకునే ఒక యువ ఫిల్మ్ మేకర్ భారత ప్రధాని పాత్రలో నటించడానికి ఈ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ను సంప్రదించినట్లు తెలిసింది.
విజయేంద్ర ప్రసాద్ ఒక నటుడిగా మారడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపకపోయినా, అతని గడ్డం లుక్ కారణంగా మోడీ పాత్రను పోషించమని అడిగినట్లు తెలిసింది. ఈ కొత్త ఆఫర్ విజయేంద్రప్రసాద్ ను ఆశ్చర్యపరిచిందని చెబుతున్నారు.. ఈ ఆఫర్ కు సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడట.. అందుకే ఈ ఆఫర్ పై నవ్వి ఊరుకున్నట్టు సమాచారం. రాజమౌళి నెక్ట్స్ సినిమాతోపాటు మరికొన్ని ఇతర సినిమాలకు కథలు రాస్తూ తన ఇతర రచనలకు బిజీగా ఉన్నాడు. అందుకే మోడీ బయోపిక్ లో విజయేంద్రప్రసాద్ నటిస్తాడా? లేదా అన్నది వేచిచూడాలి.