ఆ గౌరవంకు రాజమౌళి పూర్తిగా అర్హుడు

Update: 2022-10-04 08:38 GMT
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒక గొప్ప ఫిల్మ్ మేకర్ అంటూ ఇప్పటికే ఇండియన్ సినీ ప్రేమికులు ఒప్పుకున్నారు. అయన అధ్బుతమైన సినిమాలను క్రియేట్ చేయడంలో ఇండియాలోనే నెంబర్ 1 అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ సమయంలో ఆయన యొక్క గొప్పతనంను విదేశీ గడ్డపై కూడా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా వరల్డ్స్ బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్క్రీనింగ్ అయిన ఈ సినిమా రాజమౌళి స్థాయిని మళ్లీ లోకానికి చాటిచెప్పింది అనడంలో సందేహం లేదు.

బియాండ్ ఫెస్ట్ లో భాగంగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన సినిమా ప్రదర్శణలో రాజమౌళి పాల్గొన్నారు. సినిమా ఇప్పటికే వరల్డ్ మొత్తం కూడా నెట్ ఫ్లిక్స్ తో పాటు పలు ఓటీటీ ల్లో అందుబాటు లో ఉంది. అయినా కూడా తాజా స్క్రీనింగ్ కోసం పెద్ద ఎత్తున జనాలు హాజరు అయ్యారు. ఒక్క షో తో దాదాపుగా 17 లక్షల వసూళ్లు నమోదు అయ్యాయి. అంతకు మించి స్క్రీనింగ్ పూర్తి అయిన తర్వాత రాజమౌళికి దక్కిన గౌరవం అద్భుతం.

సినిమా పూర్తి అయిన తర్వాత ఆడియన్స్ ను ఉద్దేశించి మాట్లాడేందుకు గాను స్క్రీన్ ముందుకు రాజమౌళి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు గౌరవం ఇస్తూ.. ఆయన్ని అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చుని క్లాప్స్ కొట్టారు. ఏ ఒక్క ఇండియన్ దర్శకుడికి కూడా ఇలాంటి ఒక అరుదైన గౌరవం దక్కలేదు అనేది ప్రతి ఒక్కరి మాట. ఇలాంటి ఘనత దక్కించుకుని కేవలం తెలుుగు సినిమాకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకు గౌరవంను రాజమౌళి సంపాదించి పెట్టాడు.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లను అల్లూరి మరియు కొమురం భీమ్ పాత్రల్లో చూపించి మెప్పించిన రాజమౌళి ఇలాంటి ఒక అద్భుతం ఆవిష్కరించడం తనకే సాధ్యం అన్నట్లుగా సినిమాను తెరకెక్కించాడు. సినిమాలోని ప్రతి షాట్ కూడా నిజంగానే అద్భుతం అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సినిమా క్రియేటర్ అయిన రాజమౌళి విదేశీ గడ్డపై స్టాండింగ్ ఓవేషన్ కి అర్హుడే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News