బాహుబలి2 కి బ్రేక్ వేసిన ఎన్టీఆర్

Update: 2016-01-11 08:15 GMT
అవును.. బాహుబలి2 కి ఎన్టీఆర్ కారణంగా బ్రేక్ పడింది. బాహుబలి షూటింగ్ కి ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి సెలవలు ఇచ్చాడు. ఏకంగా 5 రోజుల సంక్రాంతి సెలవలు ప్రకటించాడు. ఇందుకు ప్రధాన కారణం.. ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో విడుదల కానుండడమే.

ఈ నెల 13న రిలీజ్ అవుతున్న నాన్నకు ప్రేమతో చిత్రాన్ని మొదటి రోజు మొదటి షో చూసేందుకు.. రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు ఇప్పటికే బుకింగ్స్ వగైరా షెడ్యూల్ కూడా సెట్ అయింది. జూనియర్ అంటే రాజమౌళికి చాలా ఇష్టం. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. మరోవైపు డైరెక్టర్ సుకుమార్ అంటే రాజమౌళికి చాలా అభిమానం కూడా. టాలీవుడ్ లో రాజమౌళి ఫాలో అయ్యే దర్శకుడు సుకుమార్ ఒక్కడే. మహేష్ తో సుకుమార్ చేసిన వన్ నేనొక్కడినే ఫెయిల్ అయ్యాక.. అతడితో సినిమా చేయడం మానేయద్దని ఎన్టీఆర్ కి సలహా ఇచ్చినది కూడా రాజమౌళే.

ఇలా ఇటు హీరో, అటు డైరెక్టర్ మీద ఉన్న ఇష్టంతో నాన్నకు ప్రేమతో చిత్రానికి మద్దతుగా నిలిచేందుకు రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. ఈ నెల 13 నుంచి 5 రోజుల పాటు మొత్తం బాహుబలి యూనిట్ కి సెలవు ప్రకటించేశాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి కోసం.. ఇప్పటికి ప్రభాస్ ఒక్కడే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు.. నాన్నకు ప్రేమతో చిత్రంపై జక్కన్న చేసే కామెంట్స్ కోసం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే.. జక్కన్న ఒక్క మాట పాజిటివ్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై చాలా ఎక్కువగా ఉంటుందన్న మాట వాస్తవం.
Tags:    

Similar News