దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా - ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా సాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదేంటి స్నేహం గురించి తీసే సినిమాలో అల్లూరి - కొమరం భీమ్ లు ఎందుకని అడగగా.. చెప్పాను కదా ఇది కల్పిత కథ అంటూ జవాబిచ్చాడు రాజమౌళి.
ఈ కథ 1919-22 మధ్య ప్రాంతంలో ఒకేసారి ఇంట్లో నుండీ వెళ్లిపోయిన ఈ ఇద్దరు యోధులు.. ఆ మూడు నాలుగేళ్లు ఏం చేసారనేది మెయిన్ కథాంశం అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక ఈ చిత్రానికి 'రౌద్రం రణం రుథిరం' అనే టైటిల్ ను ఫైనల్ చేసాడు. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసిన 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోకి అద్బుతమైన ట్రెండ్ సృష్టించింది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20న 'రామరాజు ఫర్ భీమ్' అంటూ మరో వీడియోని విడుదల చెయ్యడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించనప్పటికీ అభిమానులలో అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి.