అజయ్ దేవగణ్ అలా.. అంటున్న రాజమౌళి

Update: 2020-03-30 01:30 GMT
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' కోసం ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఏదో  ఒక లీక్ వస్తేనే సోషల్ మీడియా మోతెక్కిపోతుంది ఇక టీజర్ లాంటి క్యారెక్టర్ ఇంట్రో వీడియో వస్తే సోషల్ మీడియాలో స్పందన ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.  భీమ్ ఫర్ రామరాజు ఓ రకంగా సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో రాజమౌళి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  అజయ్ తో పని చేయడం గురించి జక్కన్న మాట్లాడుతూ "అజయ్ సర్ లాంటి స్టార్ తో పని చేయడం మా అదృష్టం. ఆయన వినమ్రత.. ఒదిగి ఉండే స్వభావం మమల్ని ఆశ్చర్యపరిచింది. షూటింగ్ సమయంలో ఆయన ఎప్పుడూ ఫ్లోర్లోనే ఉంటారు.. తన కేరవాన్ లోకి పోయేవారు కాదు" అంటూ గొప్పగా చెప్పారు. 

అంతే కాదట.. అయన పనిచేసిన షెడ్యూల్ చివరి రోజున బ్రేక్ లేకుండా పనిచేయాల్సి వచ్చిందట. దీంతో లొకేషన్ లోనే ఉన్నారట.  లంచ్ కూడా షూటింగ్ లోకేషన్ కే తెప్పించుకుని తిన్నారట. ఈ విషయం చెప్తూ అజయ్ పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 'బాహుబలి' లో బాలీవుడ్ స్టార్లు ఎవరూ నటించలేదు కానీ 'RRR' లో మాత్రం అజయ్ దేవగణ్.. అలియా భట్ లాంటి స్టార్స్ నటిస్తూ ఉండడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



   

Tags:    

Similar News