టాలీవుడ్ లో స్టూడెంట్ నెంబర్1 నుండి ఛత్రపతి - యమదొంగ - మగధీర - మర్యాద రామన్న - ఈగ.. ఇలా తను తెరకెక్కించే ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఇక ఆయన తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి. భారీ తారాగణంతో రూపొందిన బాహుబలి సినిమా తెలుగు - తమిళ - మలయాళ - హిందీ భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించింది. బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి. నిజానికి బాహుబలి ఇండియన్ సినిమానా..? హాలీవుడ్ సినిమానా? అనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రేంజ్ లో రూపొందించారు రాజమౌళి. 1000 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేసింది.
తన సినీ కెరీర్లో ఓటమి ఎరుగని రాజమౌళి తీసిన ఏ సినిమా కూడా ఇంతవరకు ఫ్లాప్ టాక్ రాలేదు. రాజమౌళి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపిస్తుంటారు. ఆయన సినిమాల్లో కొత్త కొత్త ఆయుధాలు ఆవిష్కరిస్తారు. కథ - సంగీతం - నటీనటుల విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలా రాజమౌళి రూపొందించిన ప్రతీ సినిమాలో ఒక్కో వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నారు. మరి ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..
1) స్టూడెంట్ నెం1- సీరియల్ దర్శకుడిగా ఉన్న రాజమౌళిని సినిమా మార్చింది ఇదే. ఆయన గురువు దర్శకేంద్రుడి పర్యవేక్షణలో దర్శకుడిగా మారిన రాజమౌళి మొదటి సినిమాతోనే అటు ఎన్టీఆర్ కి లైఫ్ ఇచ్చి.. దర్శకుడిగా ఆయన కూడా నిలదొక్కుకున్నారు. ఈ సినిమా నుండి డైరెక్టర్ గా రాజమౌళి.. ఎన్టీఆర్ హిట్ అందుకొని మంచి స్నేహితులయ్యారు.
2)సింహాద్రి-రెండోసారి ఎన్టీఆర్-రాజమౌళిలు జతకట్టిన సినిమా ఇది.ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హిట్ పెయిర్.. రెండో సినిమా సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా వారి స్నేహాన్ని మరింత బలపరిచిందని చెప్పొచ్చు.
3) సై- తెలుగు చిత్రసీమకు మొదటిసారి రగ్బీ ఆటను పరిచయం చేసిన సినిమా. కాలేజీ లైఫ్ - యవ్వనం - లవ్ - గోల్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా స్పోర్ట్స్ సినిమాలు తీయాలనే వారికి ధైర్యం ఇచ్చిందని చెప్పాలి. రగ్బీ ఆటను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఈ సినిమా ప్రత్యేకత.
4)ఛత్రపతి- మొదటిసారి ప్రభాస్ రాజమౌళిలను కలిపిన సినిమా ఇది. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ ని స్టార్ హీరోని చేయడమే గాక ఎనలేని స్టార్ డమ్ తీసుకొచ్చింది. అప్పటి నుండి ప్రభాస్ కెరీర్ ఏ రేంజ్ కి మారిందో చెప్పక్కర్లేదు.
5)విక్రమార్కుడు- పోలీసు స్టోరీ కథాంశంగా రాజమౌళి రూపొందించిన ఏకైక చిత్రం. మాస్ మహారాజ రవితేజ ద్విపాత్రాభినయంలో థియేటర్లను ఓ ఊపు ఊపేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో "విక్రమ్ సింగ్ రాథోడ్" పోలీస్ పాత్ర చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయేలా తీర్చిదిద్దడం విశేషం.
6)యమదొంగ- రాజమౌళి తీసిన ఏకైక సోషియో ఫాంటసీ సినిమా ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్.. యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఎన్టీఆర్ కాస్త యంగ్ టైగర్ గా బిరుదు పొందింది ఈ సినిమాతోనే. నరుడు-యముడు అనే కాన్సెప్ట్ హైలైట్. ఈ సినిమాతో ఎన్టీఆర్-రాజమౌళి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.
7)మగధీర- దేశం మొత్తాన్ని టాలీవుడ్ వైపు తిప్పిన సినిమా ఇది. రామ్ చరణ్ రెండో సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్ తో రూపొంది రికార్డులు బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ కి ఓ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది.
8)మర్యాద రామన్న- కమెడియన్ సునీల్ కి స్టార్ డమ్ తెచ్చిన సినిమా. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కమెడియన్ తో సూపర్ హిట్ సినిమా తీయడం విశేషం. "మగధీర" ఇండస్ట్రీ హిట్ తర్వాత సునీల్ ని హీరోగా ఎంచుకోవడమే వైవిధ్యమైన అంశం. ఈ సినిమా రాజమౌళిని మరో మెట్టు ఎక్కించి ఇతర భాషలలోకి అనువాదమై హిట్ సాధించడం మరో విశేషం.
9)ఈగ- ఇండియన్ సినీ చరిత్రలో హీరో లేకుండా ఒక కీటకంతో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం మాములు విషయం కాదు. ఓ ఈగలోకి మనిషి ఆత్మ దూరి శత్రువుని మట్టుపెట్టడం అబ్బో.. ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించి ఇండియన్ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లిందని గట్టిగా చెప్పొచ్చు.
10)బాహుబలి-ది బిగినింగ్- అసలు జానపద నేపథ్యంలో ఓ ఊహాత్మక చరిత్రను తెరమీదకి తీసుకురావాలి అనుకోవడమే గొప్ప విశేషం. బాహుబలి అనేది తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాతో సినిమాలోని నటులంతా ఎనలేని స్టార్ డమ్ పొందారు. తెలుగు - తమిళ మలయాళ తమిళ భాషల్లో విడుదలై అందరినీ ప్రశ్నార్ధకంగా వదిలేసింది. ఈ సినిమా విజయం.. ఎందరో అప్ కమింగ్ వారికి స్ఫూర్తిదాయకం.
11)బాహుబలి-ది కంక్లూజన్- బాహుబలి పార్ట్ వన్ వదిలిన ప్రశ్నకు సమాధానం లభించిన సినిమా ఇది. అభిమానుల అంచనాలను రాజమౌళి విజన్ ఈజీగా రీచ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2వేల కోట్లు కొల్లగొట్టింది. ఇక 1000 కోట్లు కొల్లగొట్టిన మొదటి ఇండియన్ సినిమాగా చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాతో రాజమౌళి ఎందరికో గురువు అయిపోయారు. డార్లింగ్ ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ డమ్ అందించిన సినిమా ఇదే.
12) ఆర్ ఆర్ ఆర్- ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ఇది. స్వాతంత్ర్య యోధులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ ల జీవితాల ఆధారంగా రూపొదిందించడమే ప్రత్యేకత. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ - రాంచరణ్ లు పాన్ ఇండియా స్టార్లు కానున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2021లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇలా రాజమౌళి రూపొందించే ప్రతీ సినిమా చరిత్ర సృష్టిస్తున్నాయి. చూడాలి మరి రాజమౌళి ఈ సినిమాతో మరో వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తారేమో..!